*రాబందుల రెక్కలచప్పుళ్ళు*(కవిత )-బివివి సత్యనారాయణ

ఎక్కడ చూసినా రక్తం రుచిమరిగిన రాబందుల
రెక్కలచప్పుళ్ళు రాజ్యమేలుతున్నాయి
ఎప్పుడో ఎక్కడో ,అప్పుడప్పుడూ
కనిపించే వినిపించే రాబందుల రాక
నేడు అనునిత్యకృత్యమై తారసపడుతుంది !

అభాగ్యుడు అణగారినవాడు
అగుపడితె చాలు ఏదోరకంగ
హింసకు ద్వంసరచన జరుగుతుంది
భూమికి భుక్తికీ చదువు సంధ్యలకు దూరమై
మనువాదుల కబంధహస్తాలలో నలిగి
నుజ్జయిన దీనబతుకులు ఇంకా కోలుకోకముందే
అవితట్టుకుని పూర్తిగ ఎదగకముందే
పంథా మార్చుకుని పరదా రూపాంతరమైంది
దళితుల మానభంగాలు మర్డర్లు
సర్వసాధారణమై
నేడు తెరపై న్యూట్రెండ్ దర్శనమిస్తుంది
చావబాది , గుండుగీచి ఆత్మగౌరవం దెబ్బతీయడం,
అవమాభారంతో ఉరికంబమెక్కేలా చేయడం !

మరి నీ దళితజాతి
ఉద్యమకారులు ఏంచేస్తున్నట్లు?
నాల్రోజులు వీధుల్లో హడావిడిచేసి
మీడియా సాక్షిగా బీరాలుపోయి
అదేఅరాచకవాదుల పంచన
మత్తుగా మూలుగుతుంటే,
నీ ఉత్తుత్తి ఉధ్యమాల నాడి ఎరిగినవాడు
నీచేతే నీ కంట్లో పొడిపిస్తాడు
గుండు కొట్టేవాడికి గండి కొట్టనంతకాలం
ఈ రాబందుల రెక్కల చప్పుళ్ళు
నీ వేడి నెత్తురుకోసం వేటాడుతుంటాయి
తస్మాత్ జాగ్రత్త !!

( ఇటీవల దళితులుపై జరిగే వరుస శిరోమండనాలకు చలించి )

                                                                         – బివివి సత్యనారాయణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments