మణిపూసలు-డా.వూటుకూరి వరప్రసాద్

 

 

 

1.జనపదము సిరి సుందరం
జానపదులమే అందరం
ఆ తత్వం మది చిగురిస్తే
పట్నం దరికిపోమెవ్వరం.

2.పల్లె ముంగిట కులవృత్తులు
సన్నగిల్లెనులె జన శక్తులు
ప్రపంచీకరణ దయవల్ల
వలసెళ్లిరి నిపుణు వ్యక్తులు

3.పిల్లి పండె కమ్మరి కొలిమిన
బొగ్గు నిండె కుమ్మరావమున
కుప్పలాయె జాలరి వలలు
రంగువెలిసె సాలెల మగ్గం.

4.చెప్పును మింగిది బాటా
డప్పును కోసింది వాటా
చర్మకారుల బతుకుముందు
చీకటి అలిమింది కోటా.

5.హృదయాన్ని తాకే పాట
నవనాడుల్ని మీటె మాట
కుదిపేసి పరుగులెట్టును
అల వరసలు కలిసే చోట.

డా.వూటుకూరి వరప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments