గజల్-15– ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

తెలుగు గజల్ ప్రేమికులకు నమస్సుమాంజలి.
సువిఖ్యాత గజల్ కవి జనాబ్ మహమ్మద్ ఫైజ్ వ్రాసిన ఓ అద్భుతమైన గజల్ ను అనువదించే ప్రయత్నం చేసాను. మక్కీకి మక్కీ అనువాదం ఎప్పుడూ బాగుండదు. మన జీవనశైలికి  అనుగుణంగా భాషకి అనుగుణంగా మూలానికి చాలా దగ్గరగా ఉండేలా స్వేఛ్చానువాదం చేయడం జరిగింది. ఈ గజల్ ని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

మూలం రచన :

जनाब फ़ैज़ अहमद फ़ैज़

”आप की याद आती रही रात भर”
चाँदनी दिल दुखाती रही रात भर

गाह जलती हुई गाह बुझती हुई
शम-ए-ग़म झिलमिलाती रही रात भर

कोई ख़ुशबू बदलती रही पैरहन
कोई तस्वीर गाती रही रात भर

फिर सबा साया-ए-शाख़-ए-गुल के तले
कोई क़िस्सा सुनाती रही रात भर

जो न आया उसे कोई ज़ंजीर-ए-दर
हर सदा पर बुलाती रही रात भर

एक उम्मीद से दिल बहलता रहा
इक तमन्ना सताती रही रात भर

అనువదించిన గజల్ :

నీ తలపే మనసులోన నిండుతోంది రేయంతా
ఈ వెన్నెల గుండెలోన గుచ్చుతోంది రేయంతా

ఒకోసారి వెలుగుతుంది ఒకోసారి ఆరుతుంది
శోకం నిండిన దీపం మినుకుతోంది రేయంతా

నిను తాకిన పరీమళము కొత్త పైటలేస్తున్నది
నీ చిత్రము పూలపాట పాడుతోంది రేయంతా

పూలగుత్తులున్న కొమ్మ నీడలోకి పిలుస్తోంది
మన వలపుల కథలన్నీ అల్లుతోంది రేయంతా

తిరిగిరాని వారికొరకు గుండెతలుపు తపిస్తోంది
గడియతోటి సడిచేస్తూ పిలుస్తోంది రేయంతా

ఆశపడే పిచ్చిమనసునూరడించలేకున్నా
ఒక కోరిక సతాయించి చంపుతోంది రేయంతా

     – ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)