ఇదేమి మనసో(కవిత )-డా!! బాలాజీ దీక్షితులు పి.వి

చెట్టుకూడా నాటని మనం
అడవుల కోసం పాకులాడతాం

తల్లి తండ్రుల ఆకలి గుర్తించలేని మనం
అడవి జంతువుల ఆకలిపై ప్రశ్నిస్తాం

తోడబుట్టిన వాడి అభివృద్ధిని ఓర్చలేని మనం
సమ సమాజాం కోసం అనర్గళంగా ప్రసంగిస్తాం

కళ్ళముందు కనిపించేదే ఈసడించే మనం
సేవ గురించి కబుర్లు చెబుతాం

మనిషిని మనిషిగా గుర్తించని మనం
మానవత్వపు విలువలు గురించి మాట్లాడుతాం

మనలో ఉన్న మృగత్వం గుర్తు రాని మనం…
మనలో ఉన్న మాలిన్యాన్ని గూర్చి తెలియని మనం…
మనం చేసిన పాపాలు పట్టని మనం…
ఏమిచేసినా తప్పుకాదా
మన అవసరానికి – మన అవకాశానికి !
ఇదేమి మనసో…

-డా!! బాలాజీ దీక్షితులు పి.వి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments