నేనే ఝాన్సీలక్ష్మిభాయినైతే… (కవిత ) -కనకదుర్గ

ఒక దేశ నాయకుడు
తుగ్లక్ అయ్యి
చీమల్లా ప్రజలు కరోనాకి
బలవుతుంటే,
అంతా బాగుంది,
కరోనా మాయమై
పోతుందంటాడు,
ఎలక్షన్లు,
గెలవడం ఒకటే
ముఖ్యం అతనికి,
ప్రపంచం కనీవినీ
ఎరుగని
మహమ్మారి వచ్చి
అల్లకల్లోలం
సృష్టిస్తుంటే,
మరో దేశంలో నియంత
అధికార కాంక్షతో
విర్రవీగుతున్నాడు,
మన దేశంలో
ప్రజల ప్రాణాలను
కాపాడడం తప్ప
ఇంకో ఆలోచన
లేకుండా
పని చేయవలసిన
ప్రభుత
యుద్దానికి కావాల్సిన
కొత్త టెక్నాలజీ
ఫైటర్స్ ని
కొనుగోలు చేయడం,
దేవుడికి గుళ్ళు కట్టడం,
చేస్తుంటే,
మరో చోట వున్న కట్టడాలను
కూలగొట్టి,
కోట్ల వ్యయంతో కొత్త
రాజభవనం కట్టిస్తున్నారు,
ప్రజలకి చెందాల్సిన
డబ్బుతో తమ కోరికలు
తీర్చుకుంటున్నారు,
మరో దేశంలో
ఒకడు నిరంకుశత్వం పై
గళమెత్తి ప్రజలను ఏకం
చేయ ప్రయత్నించాడని
విష ప్రయోగం
చేయించారతని పై
అతను చావు బతుకుల్లో
వున్నాడు.

వీరందరికీ బుద్ది
రావాలంటే,
ప్రజల మేలే
తమ మేలు
అనుకునే రోజులు
రావాలంటే
ఏం చేయాలి?

ఒక్కరోజుకి నేనే
ఝాన్సీలక్ష్మీభాయినైతే,
లేదా
కరోనా మారణహోమాన్ని
చూస్తూ కూడా అంతగా
పట్టించుకోకుండా
కూర్చున్న కుహానా
నాయకులను చూసి…
నాకే శక్తి వుంటే
ఏ.సి రూముల్లో,
భద్రంగా కట్టుకున్న
భవనాల్లో
తమ స్వార్ధ, కుట్ర,
కుతంత్రాలతో
బిజీగా వున్న
పందికొక్కులకి
ఫారన్ విస్కీ తాగుతూ,
ఇమ్యునిటీని పెంచే
తిండి
తిని బలుస్తున్న
బండికూట్స్ ని
ఏ.సి గాదేల్లో నుండి
బయటకు
లాగి చెర్నాకోలాతో
కొట్టి మరీ,
మత్తులో మునిగి మరో
లోకంలో విహరిస్తున్న
వారిని,
వాస్తవంలోకి లాగి,
నిండు ప్రాణాలతో,
జీవితం పై ఎన్నో
కలలు కన్నసామాన్య
ప్రజలు కరోనా
బారిన పడి శవాల
అంకెలుగా ఎలా
మారిపోతున్నారో,
వారి కుటుంబాలు
ఎలా కుమిలి,
కృశించి
పోతున్నారో
మరీ చూపించి
వారి అన్యాయపు
ఆర్జన,
ప్రజల సొత్తుని
లాక్కుని
అడ్డుకునే చేతులను
కరవాలంతో నరికి,
ఆస్పత్రులను
కట్టించి ప్రజలకు
సరయైన వైద్యం
అందించి,
వేలల్లో, లక్షల్లో
పోతున్న
ప్రాణాలను
కాపాడాలని
మనసు ఆవేదనతో,
కలను కంటున్నది!
నిజంగా నేనే
ఝాన్సీ లక్ష్మిభాయినైతే…

 –కనకదుర్గ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
డాక్టర్ చింతల రాకేశ్ భవాని
డాక్టర్ చింతల రాకేశ్ భవాని
2 months ago

కవిత చాలా బాగుంది కనక దుర్గ గారు…
డా. చింతల రాకేశ్ భవాని