నేర్చుకొనుమా ఖగమును చూడ (కవిత )-కోమలి

కొమ్మ కొమ్మను దాటుకుంటూ
పుల్ల పుల్లగా తెచ్చి పెట్టి
చక్కనైన గూడు చేసి
కిచ్ కిచ్ మంటూ
కబుర్లు చెప్పుకుంటూ
గుడ్లకేమో కాపు కాస్తూ
పొదుగుతుంటే పండగచేస్తూ
పుట్టినాక పరవశిస్తూ
ఆహారమునే నమిలి నమిలి
పిల్ల నోటి కందిస్తూ
దేనికైన జంటను వీడని
విహంగమా నీకు వందనం
ఓ మనుజుడా
అండజమును చూడ
ఆనందమును నేర్చవయ్యా
పతగమును చూడ
పవిత్ర బంధమును కాపాడవయ్యా
ఆధునికతను చూచి
అగ్ని సాక్షీ బంధాన్ని హించపరచక,
నాది నీది పంతం వదిలి
మనం మన మాంగళ్యబలమంటూ
జంటగా జీవన జ్యోతిని వెలిగించుకుంద్దాం

కోమలి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.