మాటవింటే బాగుండేది (కవిత ) -బివివి సత్యనారాయణ

 

 

 

 

అమ్మానాన్నల మాట వినివుంటే
మాస్టార్లు చెప్పిన పాఠాలు చదివుంటే
అన్నతమ్ముల వలే బుద్దిగ మసలుకుంటే
స్నేహితులవలే చక్కగ చదివుంటే
నాకూ మంచి జీతం వచ్చుండేది
మంచి జీవితం లభించివుండేది !

ప్రపంచమంతా తల్లడిల్లుతుంటే
కరోనా మహమ్మారి కాటువేస్తుంటే
ప్రభుత్వం హెచ్చరికలు జారీచేస్తుంటే
పోలీసులు పహారా కాస్తుంటే
డాక్టర్లు చక్కని సేవలు చేస్తుంటే
పెడచెవిని పెట్టకుండా వినిపించుకుని వుంటే బాగుండేది !

పనీపాట లేకుండా బలాదూరు తిరగకుండా
మాస్కుధరించి దూరంపాటించి
శావిటైజు చేసుకుని ఉండుంటే
కరోనా కాటు వేసుండేదికాదు
ఊపిరి బంధిఖానా అయ్యుండేది కాదు
బంధువులకు చివరిచూపు దక్కకుండా
శవాన్నికూడా ఇవ్వకుండా
దిక్కుమాలిన చావు వచ్చుండేది కాదు !!

-బివివి సత్యనారాయణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

తొలి కథPermalink

Comments are closed.