జాతీయ జెండా…(కవిత )-టి. తరిణయ్య

-టి. తరిణయ్య

భారతీయుని మది మెచ్చిన పండుగ రోజు…
భారత జాతి సగర్వంగా తల ఎత్తుకున్న రోజు
భరతమాత సిగలో నూతన మణి పొదిగిన రోజు…
పింగళి వెంకయ్య గారి జన్మ ధన్యమైన రోజు..
ఆంధ్ర దేశం కీర్తి దశదిశలా వ్యాపించిన రోజు..
యావత్ భారతదేశం తన ఉనికిని చాటినరోజు…
మన జాతీయ పతాకం గా ఆమోదించిన రోజు
ప్రతి భారతీయుడు తలెత్తుకుని సెల్యూట్ కొట్టిన రోజు…

ఏ త్రివర్ణ పతాకం ఎగురుతూ రెపరెపలాడితే
భరతమాతమోవీపైచిరునవ్వులు పూస్తాయో
ఏ మువ్వన్నెల జెండాను చూస్తే…
గుండెల నిండా ఆనందం ఉప్పొంగుతుందో…
ఏ జాతీయ చిహ్నం ఎర్రకోటపై ఠీవీగా నిలబడితే…
దేశ ప్రజలు ముక్తకంఠంతో జై హింద్ నినాదం అందుకుంటారో…
ఏ కేతనం శత్రువుల గుండెలు చీల్చుకుని…

జయకేతనమై విజయగర్వంతో ఎగురుతుందో
ఏ అశోక చక్రం చైతన్య రథ చక్రం అవుతుందో
ఏ కాషాయం త్యాగమయ అవుతుందో
ఏ శ్వేతవర్ణం సత్యానికి నిదర్శనమౌతుందో
ఏ ఆకుపచ్చని రంగు సస్యశ్యామలానికి
ప్రతీకౌతుందో
ఆ త్రివర్ణ పతాకమే కదా…నా భారతదేశ పౌరుషం.

వీచే గాలి ఏమి పుణ్యం చేసుకుందో కదా…
తనమేనితో త్రివర్ణపతాకాన్ని స్పృశించే భాగ్యం దక్కించుకుంది.
అరవిరిసిన విరులదేమి అదృష్టమో కదా…
పతాకావిష్కరణలో ముఖ్య భూమిక పోషిస్తున్నాయి.
ధ్వజస్తంభానిది ఎంత ధైర్యమో కదా..
తన భుజస్కంధాలపై జాతి ధైర్యాన్ని మోస్తు నిలిచేది.
కేవలం మువ్వన్నెల జెండా మాత్రమే కాదు.,
వన్నె తరగని జాతీయ ఆత్మగౌరవం.
కేవలం తిరంగ పతాకం మాత్రమే కాదు.,
స్వయంగా ఆసేతుహిమాచలం ఆలపించిన రాగమాలిక.

-టి. తరిణయ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)