జాన పదం -జన పదం-జానపదుల వైద్య విధానం 3-తాటికాయల భోజన్న


జానపదులు వారికి తెలిసిన వైద్య విధానాన్ని ఎవరికి చెప్పకుండా ఉండడం వలన చాలా మూళికలు అంతరించిపోయాయి. మిగిలి ఉన్న కొన్ని మూళికలను కూడా ముట్టకుండా ఆంగ్ల వైద్యవిధానంవైపు అందరు ఆకర్షితులౌతున్నారు. పూట గడవని కొందరు, ఎన్ని వైద్యాలయాలు తిరిగిననూ వ్యాధ్యులు తగ్గనివారు జానపద వైద్యాన్ని ఆశ్రయిస్తున్నారు. జానపదులు ఎక్కడ జీవిస్తున్నా వైద్య విధానంలో కొంత తారతమ్యం తప్పక కనిపిస్తుంది.

దంతం నొప్పి : వెన్న పూస, తిక్క వంకాయ కలిపి తినాలి.
ఎముకలు విరిగినప్పుడు : గుడ్డు మేగం, పౌఢర్ వాడితే ఎముకలు యథాస్థితిలోకి వస్తాయి.

తల నొప్పి : సున్నం ఆకు, ఎల్లిపాయ కలిపి తీసుకోవాలి.
సుగర్ తగ్గడానికి : కొర్ర అన్నం, సద్దల అన్నం

కుక్క కరిస్తే : నరకి మంచం నులుకా వేడి చేసి పెట్టాలి ( సుజాత, యాపదిన్నె, ఐజా, గద్వాల్. )

కడుపు నొప్పి : వేపపుల్లతో పళ్ళు తోముకుని, వేప రసాన్ని కొద్దిగా తాగాలి. మరియు తంగేడిపుల్లతో పండ్లు తోముకుని తంగేడు బెరుడు రసం తాగాలి. తంగేడు బెరుడుని పొట్ట భాగంలో కొద్ది సమయం పెట్టుకోవాలి.

బొక్క జ్వరం : కుక్క పొగాకు రసాన్ని ఆదివారం, బేస్తవారం (గురువారం) మెడనుండి వెన్నుపూస క్రిందివరకు రాయాలి. ఆది ఆరిపోయేంత వరకు కడగకూడదు. ఇలా రెండు వారాలు చేస్తే పై సమస్యకు చక్కని పరిష్కరం దొరుకుతుంది.

అర్షమొలలు : నల్లరం, గడి చెక్కరి (కడ, నవ్వోతు) కలిపి మూడు లేదా ఐదు పూటలు వాడాలి

తేలు కుడితే : పుట్టమీది ఉడుగు చెట్టు బెరడు లేదా ఆకుల రసాన్ని తేలు కుట్టిన దగ్గర పొయ్యాలి
పొట్ట నరాలు పట్టుకుంటే : గుంజకు తాడుకట్టి తిరగడం వలన పొట్ట బిగుతుగా మారి సమస్య తీరిపోతుంది. మరియు శరీరంలోని కొన్ని చోట్ల ఎముకలను వదులు చేస్తారు.

తలనొప్పి : ముల్కుచ్చకాయలను సేకరించి వాటి ముళ్ళను తీసివేసి కణతలపై ఇటుఅటు రెండు వైపుల ఒత్తుకోవాలి. ఇలా చేస్తే ఎంత తీవ్రమైన తల నొప్పి సమస్య అయినా వెంటనే తగ్గిపోతుంది. వీటిని తొక్కు (పచ్చడి) పెట్టుకొని తింటే శరీరానికి చాలా మంచిది. ( కస్తూరి రాజేంధర్, 36 సం,,రాలు, కోమన్ పల్లి, భీర్పూర్, జగిత్యాల)

పుండు/గాయం : నల్లాలాన్ని నూరి పెడితే త్వరగా గాయం మానుతుంది. గ్రామాల్లో నేటికి దీనినే గాయాలు మాన్పడానికి వాడుతుంటారు.( బాదినేని సత్తవ్వ, 61 సం,,రాలు, లక్ష్మికాంతపూర్, దండెపల్లి, మంచిర్యాల )

చెమటకాయ/ శరీరం వేడి చేయడం : చెమటకాయలు తగ్గడానికి వేప ఆకుని మెత్తగా చేసి శరీరానికి పూసుకోవాలి. రసాన్ని నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. ( బాదినేని గోపాల్, 45 సం,,రాలు, మంచిర్యాల)

నాభి గతి తప్పితే : కత్తెరవలం ఆకులను మెత్తగా నూరి కడుపులోకి తీసుకోవాలి. అడవి అయంటాకుని మెత్తగా నూరి దాని రసాన్ని బొడ్డు భాగంలో పోసుకొని కొద్ది సమయం ఉండాలి. ఇది చాలా వేగవంతంగా పని చేస్తుంది. తాటికాయల జమున, 38 సం,,రాలు, డొంకేశ్వర్, భీర్పూర్, జగిత్యాల)

జానపదులను తమకు తెలిసిన వైద్య విధానాలని ఇతరులతో చెప్పకపోయినా వారు వైద్యం చేసే సమయంలో వారిని అనుసరించి అడుగు జాడల ద్వారా, ఆకులు రాలిన తీరునిబట్టి మూళిక వృక్షాలను తెలుసుకున్నవారు కొందరు. స్వచ్చందంగా కొందరు ముందు తరాలకు అందించగా నేర్చుకున్నవారు ఉన్నారు.

-తాటికాయల భోజన్న

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)