సంక్షేమానందం-(కవిత)-శ్రీకా

దేశాన్ని రక్షించేందుకు
శిక్షణనొందిన
రక్షకులున్నారు;
ఆక్షేపణలెన్నున్నా,
వాళ్లదన్నుగా వెన్నైనప్రజాగణముంది
ఉన్నాపదల వలలో
ఖిన్న మనసులెన్నో!
భిన్నగళాలతో ఆకొన్న
శతృమూక
ఇంటాబయటాఏలికలే!
ప్రజాస్వేద సముపార్జనలో
పౌరుషం పడగెత్తినప్పుడు
వాక్చాతుర్యం వందనంచేస్తుంది,
బహిర్గితానందం
భజనచేస్తుంది!
కాడిమోసే రైతుకు
నాగలికరాయుధమే!
కర్రుదిగిన క్షేత్రం
ఫలిస్తుంది;
కనకం పిలుస్తుంది
విశ్వంనుండి
వినయాయుధాలు
వర్షిస్తాయి;
వీరప్పన్లూ,
విజయమాల్యాలూ
వీరామూల్యాలయిన
దోపిడీ రాపిళ్లకు
దేశం చిన్నబోతుంది;
బోఫోర్స్ బందూకులూ,
రాఫెల్ వాయాస్త్రశ్రేణి-
మాఫియా మృదంగాలో
గాలిలో వార్తలౌతాయి;
జోలె పట్టైనా-
జాతియావత్తూసత్వమై
సాక్ష్యంగా నిలుస్తుంది
అలుపెరుగనిఆకాంక్షల
ప్రతిపక్షం కన్నీళ్ళోడ్చి
కమతదారుణ్ణారేస్తుంది
శిక్షణలో కుచ్చితత్వం
భక్షణ మొదలౌతుంది;
ప్రజాపర్యవేక్షణకర్వై
కలహం కనుజూస్తుంది
విజయాహ్వానం
వెన్నుచరుస్తుంది
వాకిటిముందే
తలెత్తిన టెర్రరిజం
హిప్నాటైజ్ చేస్తుంది
బ్యాంకులంకెల్లో
లౌక్యం మొలుస్తుంది;
మరల శ్రమింధనం జాతీయాన జనిస్తుంది
విశ్వవిపణి రాణిస్తుంది
విచారం విచారణలో
విగతజీవై జడుస్తుంది
వర్తమాన వ్యవహారం
విశ్వవ్యాప్తమై
విజయంహర్షామోదిగా
చోరచోదితాహార్యమై,
రాజీపడనిరాజకీయమై
మాజీచరిత్రపై
మరలా మసిపూస్తుంది
మరోచరిత్రమార్మ్రోగి
భారీ బేహారౌతుంది*

                                                                -శ్రీ”కాట్రగడ్డ”.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)