#ఏది కవిత్వం(కవిత )…గాయత్రి శంకర్ నాగాభట్ల

ఆవేశాన్ని ఆచరణలో పెట్టించి
ఆందోళన నుండి ఆలోచింపజేసి
కవితలపున జనియించిన అక్షరమాలిక….
కలము పెంచిన మానస పుత్రిక “#కవిత్వం”

మనసుల్ని రంజింపజేస్తూ మనుషుల్ని ఆలోచింపజేసే సృజన…!

జాగృతావస్థలో ఉన్న జీవనాన్ని మేల్కొలిపే నిరంతర సాధన “కవిత్వం”…

కుళ్లిపోతున్న వ్యవస్థను చూసి మనసు అగ్నిజలపాతమై
మూగవేదనలోంచి మొలకెత్తే మాటకు రూపమై

అచ్చెయ్యని అక్షరాల వేదన
పురుడుపోసుకున్న పదాల కల్పన “కవిత్వం”

నవ్యకవిత్వమంటూ నాన్చకుండా…
నూతన పుంతలు తొక్కుతోంది అంటూ నోరెళ్లబెట్టకుండా…

కలాన్ని ఝళిపిస్తూ… కవిత్వానికి ప్రతినిధిగా ఉంటూ
ప్రజాపక్షం వహిస్తూ…
పోరాటపటిమ పుణికితెచ్చుకుంటూ…

సాగే నా ఈ కవిత పడుతోంది శ్రీ శ్రీ బాట
ఎగరెయ్యగా విప్లవపు బావుటా…!!

-గాయత్రి శంకర్ నాగాభట్ల.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.