కోడింగ్ ఎర్రర్ (కవిత )-మదన్

ప్రేమపుప్పొడి అల్లుకోనుండే
మనసుపువ్వును
ఎలా ముట్టుకోవాలో తెలియకనే
అవసరాల ఒరలో
ప్రణాళికను పెట్టుకోస్తారు
సిగలోకి సంపెంగలా
మనిషిని మమతతో
ముడి వేసుకోవడం చేతగాకనే
మేథో దండకం ఒంగి చదువుతారు
ఆఘ్రాణించే విధానం గ్రహించకనే
పన్నీరు దాహర్తికనుకొంటారు

ఒకోసారి
ఒక్క హృదయం గెలవడానికే
ఒక జన్మ సరిపోదు
ఇక వారికి ప్లురల్
పనిష్మెంట్ అవుతుందేమో?!

ఒద్దికగా చెబుతాను
ఉత్తమంగా విను

పూలు కోసుకు రావడం అంటే
తోటమాలి లేనప్పుడు కాదు
విచ్చుకున్న విరులను పుచ్చుకోవడం
కొడవలితో కాదు
వీటికో మనో సుకుమారమైన
లెక్క ఉంటది
సున్నితం సన్నిహితంగాలేని
హృదయాలకెప్పుడు
చిక్కుగానే ఉంటది

మదన్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.