నీటి మీద రాతలు(కవిత ) – నవీన్ చంద్ర

మనసెప్పుడో ముసుగేసుకుంది
నీటి మీది రాతలయ్యే నిజాలను చూసి
గోడకట్టినట్టు నిలిచే అబద్ధాలను భరించి

ప్రతి మనిషిలో మరో ‘మనీ’షి ఉంటాడని
ఎరుకలోకి వచ్చిందేమో
ప్రతీ నిజాన్ని మోసేందుకు అబద్ధాలే

పునాదులు అవుతాయని తెలిసొచ్చిందేమో
తానూ మనసిచ్చింది
మసిపూసి మారేడుకాయ చేసే విద్యను నేర్చుకొచ్చింది
ముళ్లులేని గులాబీని సృష్టించే నైపుణ్యాన్ని
తానూ అరువుతెచ్చుకుంది
మాటల ఆయుధంతో మనుషుల్ని చంపే కళను ఒడిసిపట్టింది

ఓ గెలుపు కోసం వంద ఓటముల్ని

ఎదుర్కోవడం అలవాటుచేసుకుంది
ఓ రోజు ఎదురయ్యే మరణాన్ని జయించేందుకు

చస్తూ బతకడాన్ని దినచర్యగా మార్చుకుంది

కానీ చివరికి …
వినవచ్చే వేదాంతాల్లో
ఏవి నీటి మీది రాతలో
ఏవి శిలలపైన స్వర్ణాక్షరాలో అర్థం కాక…
ముసుగుతోనే జీవిచడం నేర్చుకుంది……!!!

-నవీన్ చంద్ర

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)