జర జాగ్రత్త మనిషి(కవిత )- బీర రమేష్

పాపభీతి రోగభీతి మరణభీతి
మనిషి చేత ఏపనైనా చేయిస్తాయి
మానవలోకంలో తరతరాలుగా
కొందరు తలలొంచడానికి
కొందరు తలలెత్తుకు తిరగడానికి కారణమవి
సమయానుకూల ప్రవర్తన వాటి నేర్పరితనం
మనిషి తన జీవితాన్ని తమకి అర్పించేలా
శిక్షణనిచ్చాయి
విపత్కర పరిస్థితుల్లో కూడా
తమ దళాన్ని మనుషుల మీదకి వదుల్తున్నాయి
తమ స్మరణను మరువనీకుండా చేయడానికి
ఆ దళాలకి మనుషుల ప్రాణాలతో పనిలేదు
విలువైన మాటలనే మత్తులో పడేసి
ధనాన్ని దండుకోవడమే వారి పని
సున్నితత్వపు మనుషుల మనసును
సొమ్ము చేసుకోవడానికి బయల్దేరాయి
రాక్షసమూకలు
మోసం మనిషి రూపం దాల్చిన హైనాలు
కరోనా కంటే ప్రమాదకరమైన వాటిని
మనిషిలోకి ఎక్కించాలని తపనపడుతున్నాయి
భయం ఎప్పుడూ ఎదుటివాడికి
పెట్టుబడిలేని లాభాన్ని ఆర్జిస్తుంది
భయాన్ని భూతద్దంలో చూపించి
రూకలు ఏరుకుంటున్న నయాదోపిడీదారులు
మానవత్వం ముసుగులేసుకున్న
హంస చర్మాల నక్కజిత్తుల గాళ్లు
రంగురంగు వస్త్రాలు దేహానికి చుట్టుకున్న
మేకవన్నెపులులు
బయల్దేరారు మనుషుల్ని మోసం చేయడానికి
ఆలోచించగలిగే మెదళ్లకు
మత్తుమందు పూయాలని చూస్తున్న
ఉన్మాదకారులు
మనిషికి మానవత్వం నేర్పమన్న మతాన్ని
మనీగా మార్చుకుంటున్న హవాలాదారులు
జర జాగ్రత్త మనిషి
మోసాన్ని వృత్తిగా బతికే కేటుగాళ్లు
కళ్లముందే తిరుగుతుంటారు
నిన్నేకాదు నీ రూపాన్నే మార్చేస్తారు
అన్నీపోయాకే వస్తుంది
నీకు అసలు రూపం
అప్పుడే తెలుస్తుంది
వాళ్ల నిజస్వరూపం.

-బీర రమేష్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)