ఈ అరాచకాలకి అదుపులేదా-వెంకటేశ్వరరావు కట్టూరి

అయ్యో !రాజులేలిన గడ్డపై
అరాచకాలా
దేశానికి ప్రథమ పౌరుడిగా
మా పెద్దన్న
ఉన్న దేశంలో
మా పెద్దక్క హోంశాఖాధినేతగా ఉన్న
రాష్ట్రంలో
అరుంధతీ సుతులపై
అకృత్యాలా
‘దిశ’తో దిక్కు మార్చుకున్నారా
జానారణ్యంలో
తోడేళ్ల గుంపు జొరబడి
గొర్రెపిల్లలా నన్ను అపహరించుకుపోయారు
నా గావుకేకలు వినిపించడం లేదా
నా వేదన అరణ్య రోధనేనా
లేక మీ చెవుల్లో
సీసం పోసుకున్నారా
ప్రశ్నించరేమి ఎదురు తిరగరేమి
ఆకాశంలో సగం అవనికే తల్లులు మీరంటూ
ఊకదంపుడు ఉపన్యాసాలకే పరిమితమా
మీ గొంతుల్లో
పచ్చి వెలక్కాయ
ఇరుక్కుపోయిందా
చిగురించే అడవిమల్లె తీగను
తంబుర తీగలా తుంచేశారు
ఈ వీణ మూగ పోయింది
మీనోళ్లు పెగలడంలేదా
ఆ కామ పిశాచాలు
కాలనాగులై బుసలు కొడుతూ కర్కశంగా కాటేసాయి
వేటగాడి ఉచ్చులో చిక్కుకు పోయిన బోడిగువ్వలా
బలైపోయాను
బలురక్కసి చెట్ల మధ్య
చీరుకుపోయి రక్త ధారలు
కారే నా దేహం
మీకు కనిపించడం లేదా
వాన నీటికి వికసించిన
లేత గులాబీ మొగ్గ రేకులు నిలువునా రాలిపోయాయి
మృగరాజు విసిరిన
పంజా దెబ్బకి
విలవిల్లాడిన కస్తూరి జింకలా
మానవ మృగాళ్ల చేతిలో
బలైపోయాను
నా ఒంటిమీద పచ్చి గాయాలు సలపరిస్తుంటే
మౌనంగా భరించాను
నాగోడు మీకు వినిపిస్తుందా
నాకు అండగా నిలువెత్తు గోడలా నిలబడతారా
ఈ సబ్బండ బిడ్డకి….

                                                               -వెంకటేశ్వరరావు కట్టూరి

`~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)