భూమి(కవిత )-జ్యోతిరాణి జో

భూమిని నమ్ముకున్న బ్రతుకులు నాడు
భూమిని అమ్ముకునే బ్రతుకులు నేడు
భూమిని దున్ని పంటను పండించే నాడు
భూమిని చీల్చి భవనాలు నిర్మించే నేడు

అమ్మతనంలాంటి మట్టి సహజత్వం నాడు
మట్టితనం గురించి చెప్పుకునే కృత్రిమత్వం నేడు
మొలకలు చూసి మురిసిన వైనం నాడు
నింగిని తాకిన మేడలు చూసి మురిసిన వైనం నేడు

చల్లని పైరు గాలితో పులకించిన మేను నాడు
ఇరుకు గదిలో గాలికై పాట్లు పడే నేడు
పచ్చదనం కంటికి కనువిందు నాడు
కంటికి కానరాని దూరంలో పచ్చదనం నేడు

పచ్చని పైరులో చిగురించిన ఆశలు నాడు
పచ్చని పైరు కోసం ఆవిరైనా ఆశలు నేడు
వడ్లని విసిరి వచ్చిన పంట పండుగ నాడు
120 రోజుల అన్నపుమెతుకు విలువ తెలియక నేడు

నాగరిక పోకడలకు వలస వెళ్లిన బ్రతుకులు నాడు
స్వచ్ఛమైన పల్లెదనం కోరుకునే బ్రతుకులు నేడు

                                                                                -జ్యోతిరాణి జో

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.