ఎర’ కు పడ్ద ‘చేప'(కథ)..సుజాత!’

sujatha

“టక్..టక్”
“సుజీ..ఎవరో తలుపు కొడుతున్నారు చూడవోయ్”
“అబ్బబ్బా..నేను దోశలేస్తున్నాను..మీరే తలుపు తియ్యండీ”
“టక్..టక్”
మళ్లీ తలుపు చప్పుడు అవడంతో ఆసక్తిగా చదువుతున్న పేపర్ పక్కన పడేసి విసుగ్గా వెళ్లి తలుపు తీశాడు సుబ్రావ్.

“నమస్కారం సార్..నాపేరు అంతరిక్షం. నాసా తెలుగు విభాగం నుంచి వచ్చాను. ఎప్పట్లా కాకుండా ఈసారి చంద్రమండలం మీదకి సామాన్య జనం నుంచి కొంతమంది అదృష్టవంతులని ఎంపిక చేసి పంపుదామని నిర్ణయించాం. దానికి లక్కీగా మీరు సెలెక్ట్ అయ్యారు. కంగ్రాట్స్!”అన్నాడు.

“బాబూ, ఇలాంటి కహానీలు చెప్పి మా డిటెయిల్స్ తీసుకుని పంగనామాలు పెట్టడం, లేదా ఇంట్లోకొచ్చి మత్తుమందు చల్లి ఉన్నదంతా ఊడ్చుకెళ్లడం పేపర్లలో చదువుతూనే ఉన్నాం. మాకు ఇంట్రస్ట్ లేదుగాని వెళ్లిరా నాయనా” అని అటు తిరిగి తలుపు వేయబోయాడు.

“సార్, ఇదిగో నా నాసా ఐ డీ..మీరనుమానించడంలో తప్పులేదు. ఇస్రోవాళ్ల నెంబరు ఇదిగోండి.. ఫోన్ చేసి మీరే కనుక్కోండి. వాళ్లూ ఈ ప్రాజెక్ట్ లో భాగస్వాములే..దీనికోసం మీరొక్క పైసా కట్టనక్కరలేదు, అంతా నాసాయే భరిస్తుంది.!”అన్నాడు.

“మాకొద్దులే..బా..”అని అనబోతున్నంతలో పావలా ముఖాన్ని రెండ్రూపాయల కాయినంత చేసుకుని “మీరుండండి..మీకన్నీ అనుమానాలే..లోపలికి రండన్నయ్యా”అని తలుపులు బార్లా తీసింది సుజాత.

అతి ముఖ్యమైన దోశల సంగతి పక్కన పెట్టి వచ్చిన భార్యను అయోమయంగా చూస్తూ నుంచున్నాడు.

ఆయన లోపలికి వచ్చి కూర్చున్నాక. చల్లని మజ్జిగ ఇచ్చి”నువ్విందాక ఆయనతో చెబుతున్నది ఒక చెవ్వేసి విన్నానన్నయ్యా, రాకెట్ లేకుండానే నా మనసు చంద్రుడి దగ్గరకి వెళ్లిపోయింది. అదృష్టం అందలం ఎక్కడమంటే ఇదేనేమో అన్నయ్యా. అవునూ..ఇది నిజమే కదా, అసలు మేమెలా సెలెక్టయ్యాం?” ఆనందంతో పాటు ఒకింత అనుమానం కలబోసింది మాటల్లో.

“ఇది నిజంగా నిజమమ్మా..లాస్ట్ టైం మీ దంపతులు మల్టీ ప్లెక్స్ లో సినిమా కెళ్లినప్పుడు ఫాం ఫిల్ చేశారు, అలా వచ్చిన ఎన్నో ఫామ్స్ లో నుంచి లాట్రీ తీస్తే, మీ ఇద్దరూ సెలెక్ట్ అయ్యారు, ఇహ మీ ఆరోగ్యాలు బావుండి..మా దగ్గర అవసరమైన ట్రైనింగ్ తీసుకుంటే..రాకెట్ ఎక్కొచ్చు”

“అవునా..ఫాం ఫిలప్ చేశామా? చేసే ఉంటాం. మా ఆరోగ్యాలకేం అన్నయ్యా ఇప్పటిదాకా మందుబిళ్ల ఎరగం. అన్నట్టు మాతో ఇంకెవరు వస్తారు?”తమకు బెర్త్ కన్ఫర్మ్ అవడంతో మరెవరికీ సీటు రాకుండా ఉంటే బావుణ్ను అన్న దుగ్దతో అంది.

“మీరూ.. ధిల్లీ నుంచి మరో జంట..మా ఆస్ట్రోనాట్స్ అంతేనమ్మా” అన్నాడు.

“ఎంత చల్లని వార్త చెప్పావన్నయ్యా”

“ఇదిగో మీ యాక్సెప్టెన్స్ తో కూడిన టర్మ్స్ అండ్ కండీషన్స్ ఉన్న ఈ కాగితాల మీద మీరు సంతకాలు పెడితే డీల్ క్లోజ్ అవుతుంది”అన్నాడు.

ఆత్రంగా కాగితాలందుకుని తను సంతకం పెట్టి, భర్త సంతకం కోసం పరిగెత్తింది. “కాస్త టర్మ్స్ చదివి సంతకం పెడతా సుజీ..”అంటుంటే “అన్నయ్య అన్యాయం చేస్తాడటండీ..ముందు సంతకం పెట్టండి”అని సంతకం పెట్టించి, కాగితాలు అంతరిక్షం చేతిలో పెట్టింది.

“సరేనమ్మా నే వస్తా..రెండ్రోజుల్లో నాసా నుంచి కొరియర్ ద్వారా రాకెట్లో మీకు అలాట్ చేసిన సీట్ నంబర్స్ తో పాటు ఫుల్ డిటైల్స్ ఉన్న పేపర్స్ వస్తాయి. వాటిని భద్రంగా దాచుకోండి. ట్రిప్ పూర్తి అయ్యే వరకూ వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ట్రైనింగ్ డేట్స్ కన్ఫర్మ్ అయితే తెలియబరుస్తా..చెప్పిన చోటుకు మీరొద్దురుగాని..ఇదిగో నా సెల్ నెంబరు..ఏదైనా డౌట్ వస్తే కాల్ చేయండి..అన్నట్టు ఇప్పుడే పబ్లిసిటీ చేసుకోకండి, సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. అంతా అయ్యాక నేనే చెబుతా, అప్పుడు అందరికీ ఆనందంగా చెబుదురుగాని” అంటూ కార్డిచ్చి వెళ్లిపోయాడు.

“ఇహ చూడండీ నా సామిరంగా చంద్రుడికి మన ప్రయాణంతో..చుట్టాళ్లకి, పక్కాళ్లకీ కళ్లు కుట్టిపోవాలి. ఎంత డబ్బున్న వాళ్లకీ దక్కని అదృష్టం మనకు దక్కింది” అంది తాదాత్మ్యంగా కళ్ళు చికిలించి మురిసిపోతూ.

అందరికీ ఫోన్లు చేసి చిలవలు పలవలుగా చెప్పాలనుకున్నా బలవంతంగా నిగ్రహించుకుంది సుజాత.

అంతరిక్షం అన్నట్టుగానే రెండు రోజుల్లో కొరియర్లో కొన్ని డాక్యుమెంట్లు వచ్చాయి. అందమైన రాకెట్లు, ఆస్ట్రోనాట్స్ ఉన్న ఆయిల్ ప్రింట్లతో, ఏం చేయాలి, ఎలా చేయాలి? అన్న డిటెయిల్స్ తో వచ్చిన ఆ పేపర్లను దేవుడి దగ్గర పెట్టి మురిసిపోయింది సుజాత. ఆమెని నిర్లిప్తంగా చూస్తుండిపోయాడు సుబ్రావ్.

మరో రెండు రోజులు గడిచాక హఠాత్తుగా ఊడి పడ్డాడు అంతరిక్షం”చెల్లెమ్మా.. రాకెట్ ఫ్యూయెల్ కోసం ఓ లక్ష కట్టాలమ్మా..” అన్నాడు.

“లక్షా..అయినా మేమొక్క పైసా పెట్టక్కర్లేదన్నావు?” నిష్ఠూరమాడింది.

“అయ్యో..ట్రైనింగ్ కు, ఫుడ్ కు, ఆస్ట్రోనాట్ డ్రస్ కు, నాసా లోని రక్షిత ప్రాంతాల్లో తిరుగుతూ మీరు తీయించుకునే డిజిటల్ ఫోటోలకు అయ్యే ఖర్చంతా మాదేనమ్మా..కేవలం ఫ్యూయల్ కే మీరు పెట్టుకోవాలి. మీకిచ్చిన డాక్యుమెంట్లలో ఆ డిటెయిల్స్ ఉన్నాయి..చదవలేదా..అయినా తెలుగు వాళ్లనిపించుకున్నారు. ఆ ధిల్లీ వాళ్లు లక్ష అడిగితే, రెండు లక్షలు ఇచ్చారు. తమకు వరంగా దక్కిన ఈ ట్రిప్ ఆహ్లాదాన్ని పంచేలా ఉండాలనీ..వాళ్లకు చక్కటి ఫెసిలిటీస్ ఏర్పాటు చెయ్యమనీను..ఇదిగో చెక్కు. నిన్ననే కలెక్ట్ చేసుకున్నాను. నోరారా అన్నయ్యా అని పిలిచిన నిన్ను మోసం చేస్తానని ఎలా అనుకున్నావమ్మా?”

“లేదన్నయ్యా లేదు. ఊరకే అడిగాను”అవకాశం ఎక్కడ చేజారిపోతుందో అని మనసులో మదనపడుతూ..” ఏవండీ అన్నయ్యకి లక్షకు చెక్ రాసి ఇవ్వండి”అని ఆజ్ఞ జారీ చేసింది.
తన రిటైర్ మెంట్ కి వచ్చిన డబ్బులతో వృద్ధాప్యం హాయిగా ఏ చీకూ చింతా లేకుండా గడచిపోతుందనుకుంటే..సుజీ లక్ష బొక్కపెట్టింది..ప్చ్అనుకుంటూ చేసేదేం లేక చెక్కుమీద అంతరిక్షం చెప్పిన డిటేయిల్స్ రాసి సంతకం పెట్టిచ్చాడు.

“వస్తాను చెల్లెమ్మా..అన్నట్టు కరెక్ట్ గా ఇవాళటి నుంచి ఆరో రోజు ఉదయం ఆరు గంటలకు ఒక వ్యాన్ వచ్చి మిమ్మల్ని శంషాబాద్ తీసుకెళ్లి, అక్కణ్నుంచి ఫ్లైట్లో ధిల్లీ పంపుతారు. అక్కడ ఉన్న మావాళ్లు మిమ్మల్ని రిసీవ్ చేసుకుని, ధిల్లీలో ఉన్న ఇద్దరినీ కలెక్ట్ చేసుకుని మిమ్మల్నందరినీ అమెరికా పంపుతారు. హావ్ ఎ నైస్ అండ్ మెమొరెబుల్ ట్రిప్”అని నవ్వుతూ వెళ్లిపోయాడు.
ఇహ ఆ ఆరు రోజులూ సుజాత అన్నం తింటే ఒట్టు, నిద్రపోతే డబల్ ఒట్టు. తను అద్భుతమైన ట్రైనింగ్ తీసుకున్నట్టు, మ్యాచింగ్ డ్రస్ వేసుకుని రాకెట్ దగ్గర సెల్ఫీలు తీసుకున్నట్టు, వాట్సప్..ఫేస్ బుక్కుల్లో అప్ లోడ్ చేసినట్టు, అనూహ్య సంఖ్యతో లైకులు పొందినట్టు, చంద్రమండలం మీద దిగినట్టు, అక్కడా ఫోటోలు..వీడియోలు తీసుకున్నట్టు, బంధువుల కోసం గంగ నీళ్లు తీసుకొచ్చినట్టు..చంద్రమండలం మీద నుంచి మట్టి సంచీలో కలెక్ట్ చేసి తెచ్చి అందరికీ ఇచ్చినట్టు, వాళ్లు మానసికంగా కుమిలిపోతూ, శారీరకంగా నవ్వుతూ చెబుతున్న అభినందనలను గర్వంగా అందుకుంటున్నట్టు, రాత్రి కలలూ..పగటి కలలూ కని మురిసిపోయింది. ఫండింగ్ చేసిన సుబ్రావ్ ఆ సీన్స్ లో ఎక్కడా లేకపోవడం గమనార్హం.
ఆర్రోజులయిపోయాయి. వ్యాన్ రాలేదు. అంతరిక్షం ఫోన్ స్విచ్చాఫ్.

తన ట్రిప్ అప్సెట్ అయి మెంటల్ గా డిస్ట్రబ్ అయిన సుజాతను వదిలి, లక్ష పోయినందుకు లబోదిబో అంటూ కంప్లయింట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు పరిగెత్తాడు సుబ్రావ్.
ఇలాంటి ఎన్నో కేసులు రాసుకున్న శీనయ్య నిర్లిప్తంగా మరో కేసు రాసుకున్నాడు. చేపలకోసం మోసగాళ్లు ఎరలు మార్చడం అతనికి కొత్తకాదు. కుప్పలు తెప్పలుగా చేపలు పడడమూ కొత్తకాదు.

—సుజాత.పి.వి.ఎల్.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కథలుPermalink

5 Responses to ఎర’ కు పడ్ద ‘చేప'(కథ)..సుజాత!’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో