జ్ఞాపకం-50 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

Anguluri Anjani devi

ఒక వైపు తల్లీ, తండ్రి, ఇంకో వైపు ఇద్దరు అన్నయ్యలు. తండ్రి తిలక్ ని తిట్టడం, కొట్టబోవడం. తిలక్ వెళ్లిపోతానని బెదిరించటం. తల్లీ, పెద్దన్నయ్య భయపడి తిలక్ ని వెళ్లొద్దని పట్టుకోవటం. తండ్రి, తిలక్ ఆగకుండా వాదించుకోవడం ఇదే బీభత్సం. ఇదే యుద్ధం.

చివరకి “ఆగరా తిలక్! నువ్వు వెళ్తే నేను మాత్రం ఈ ఇంట్లో వుంటానను కుంటున్నావా ? నీ దిగులుతో చచ్చిపోతానురా !” అంది సులోచనమ్మ.

ఆమె మాటలు హృదయాన్ని చీల్చుకొని వస్తున్నట్లే వున్నాయి. తిలక్ ని వెళ్లొద్దంటూ అడ్డుగా చేతులు చాపి నిలబడింది.

“నీ అంత పిచ్చిది ఈ ఊళోనే లేదు. అందుకే వాడలా తగలడ్డాడు. ముందు వాడిని వెళ్లనీ. అడ్డులే ” అంటూ అరిచాడు రాఘవరాయుడు.

తిలక్ ని ఇంట్లోంచి వెళ్లమంటుంటే తనకి పోయిన సబ్జెక్టులు గుర్తొచ్చి తండ్రి తనని కూడా వెళ్లమన్నట్లే వుంది సంలేఖకి.

తిలక్ బయటకెళ్తే దొంగతనం చేసుకునైనా బ్రతుకుతాడన్న ధైర్యం వుంది తండ్రికి. ఆయన మాటల్లో కూడా అదే వుంది. మరి తను బయటకెళ్తే ఏం చేసుకుని బ్రతకాలి? తనెంత తప్పు చేసింది? ఒక ర్యాంక్ స్టూడెంట్ అయివుండి కూడా సబ్జెక్టులు పోయేలా చేసుకుంది. దీన్నిప్పుడు ఆలోచిస్తుంటే తనే జీర్ణించుకోలేక పోతోంది. మరి ఇంట్లో వాళ్ల మాటేమిటి?
రాఘవరాయుడు సులోచనమ్మ మీద కేకలు వేస్తున్నాడు.

“నీ వల్లనే పిల్లలు చెడిపోయారు” అంటున్నాడు. ఆయన కేకలు ఊరంతా విన్పించేలా వున్నాయి.
తిలక్ కూడా తండ్రికి ఏ మాత్రం తీసిపోకుండా అరుస్తున్నాడు “అమ్మనెందుకు అంటావు నాన్నా! తల్లి కదా! ఆమెకు బిడ్డ వెళ్లిపోతాడని బాధ వుండదా? నువ్వంటే రాక్షసుడివి. నీకే బాధాలేదు. అదేం చిత్రమో మార్కులు మరిన్ని వస్తేనే ప్రేమగా చూస్తారు నీలాంటి తండ్రులు” అన్నాడు తిలక్..

ఆ మాటలు వినగానే కొమ్మ గుచ్చుకుని పూలు గాయపడ్డట్లు రాఘవరాయుడి హృదయం బాధపడింది. వార్థక్యం నిండిన చెట్టులా ఆయన రోజురోజుకి వాలిపోతున్నా కొడుకులో సూర్యుడ్ని చూసుకోవాలనుకుంటున్నాడు. అది గమనించిన సంలేఖ తిలక్ ని తండ్రి ని తదేకంగా చూస్తోంది. మార్చి మార్చి చూస్తోంది.

రాజారాం కంగారు పడుతూ “నువ్వు నాన్నతో వాధించకురా. అసలే నాన్న కోపంతో వున్నాడు. ముందు నువ్వు లోపలకి పద” అంటూ తమ్ముడ్ని బలంగా నెట్టుకుంటూ లోపలకి తీసుకెళ్లాడు.
అన్నయ్య లోపలికి నెడుతుంటే అడ్డుచెప్పలేక ఒక్క క్షణం ఆగి విసురుగా చూస్తూ “ఆయన కోపంగా వుండి నన్నేం చేస్తాడన్నయ్యా! ఇంట్లోంచి వెళ్లి పొమ్మంటాడు. చేతికందింది తీసుకుని కొడతాడు. అంతేగా! నేనుండేది ఆయన కోసమేం కాదు అమ్మకోసం. అమ్మే లేకుంటే ఏముందన్నయ్య ఇక్కడ ?” అన్నాడు తిలక్.

అతడు మాట్లాడే తీరు చూస్తుంటే అమ్మ ఒక సముద్రం. అమ్మ ఒక ఆకాశం. అమ్మ ఒక అరణ్యం. అమ్మ ఈ భూమండలం. నాన్నది ఏముందిక్కడ? ప్రేమగా మాట్లాడుతాడా? కొసరి కొసరి తినిపిస్తాడా? డబ్బులడిగితే వెంటనే ఇస్తాడా? ఫెయిలయితే కొట్టకుండా వుంటాడా? అన్నట్లుంది.

దానికి రాఘవరాయుడు మండి పడి “నా విలువ నీకు తెలియటం లేదురా! నీకే కాదు చాలామంది పిల్లలకి తండ్రి విలువ తెలియదు. ఏదో అవసరం కొద్ది నాన్న వున్నాడు అనుకుంటారు. అన్నీ నాన్నే అనుకోరు. అందుకే నీలాంటివాడు నాన్న వుండేది ద్వేషించటానికే అని దూషిస్తుంటాడు. పోరా ! పో !” అన్నాడు. ఆయన కోపం బాధగా మారి తలవంచుకున్నాడు.

సంలేఖకి ఆక్షణంలో తండ్రిని చూస్తుంటే జాలిగా అన్పించింది.
సులోచన భర్తకి దగ్గరగా వెళ్లి “వాడికి ఏం తెలుసని మీరు బాధపడతారండీ! తెలిస్తే వాడు అలా మాట్లాడుతాడా?” అంటూ సర్ధిచెప్పింది.

“వాడికి నేనేం ద్రోహం చేస్తున్నానే. వాడు నన్నలా అర్థం చేసుకుంటున్నాడు?” అన్నాడు. ఆయన గుండెల్ని చీల్చుకుంటూ వచ్చింది ఆ ప్రశ్న.

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)