సైనికుడనై జీవిస్తా… (కవిత )-టి. తరిణయ్య

దేశ రక్షణే నా ధ్యేయం…
దేశం కోసమే నా ప్రాణం…
శత్రుమూకల సంహారమే నా లక్ష్యం…
కఠోర శిక్షణా నైపుణ్యమే నా బలం…
జైహింద్ నినాదమే నా ఆయుధం..

అంతులేని ఆత్మవిశ్వాసం నా సొంతం..
నా గుండె చప్పుడే… దేశభక్తి నినాదం.
మేరా భారత్ మహాన్ అనేది నా మంత్రం
దేశ సేవలో నా ప్రాణం… తృణప్రాయం.
దేశ సరిహద్దుల్లో గస్తీ కాస్తూ నిలబడతా…
క్రమశిక్షణకు చిరునామాగా నిలుస్తా..

ఒక్కసారి యూనిఫామ్ ధరించానంటే..
నా కు నేనే ఒక ఆయుధంగా మారిపోతా.
ప్రతికూల వాతావరణంలోనైనా నా ప్రతాపం చూపిస్తా.
నాకు కుటుంబ యోగక్షేమాలు కన్నా…
దేశ యోగక్షేమాలే మిన్న.
శత్రువు తెగబడితే.. మెరుపు దాడినై… మట్టుబెడతా.

ఊపిరి ఉన్నంతవరకు దేశంకోసం పోరాడుతా
గుండెనిండా ధైర్యం నింపుకొని..
పౌరుషాన్ని కవచంగా ధరించుకొని..
దేహాన్ని వజ్రాయుధంగా మార్చుకుని..
కదనరంగంలో కదం తొక్కితే…
విజయమో…. వీరస్వర్గమో…
నేను సైనికుడుగా తయారవ్వబడలేదు…
ఒక సైనికుడనై భరతమాతకు జన్మించాను.
వీర సైనికుడునై విజయగర్వముతో తిరిగివస్తా
లేదా….
వీరస్వర్గం పొంది… గౌరవ వందనం స్వీకరిస్తా.
నేను సైనికుడను..భరతమాత ముద్దుబిడ్డను.

( వీర మరణం పొందిన ప్రతి సైనికునకు అంకితం )

-టి. తరిణయ్య

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)