జానపదం-4  – జానపదుల వైద్య విధానం- భోజన్న

జానపదులని జ్ఞానపదులనడం అతిశయోక్తి కాదు. వీరి జ్ఞానం అపరిమితం, శ్రేయస్కరం. ఆచితూచి ఆడుగులేస్తూ జీవితాన్ని అనుక్షణం సుఖమయం చేసుకుంటారు. వీరి జీవితంలో విపరీత ధోరణులు మచ్చుకైన కనిపించవు. జీవితంపై పరిపూర్ణ అవగాహన, స్వేచ్ఛా ప్రియత్వము, స్వార్థరాహిత్యం, కోరికలేనితనం, పారదర్శకత్వం మొదలైనవన్ని కలగలపి నిండుకుండను తలపించేవారే జానపదులు. వీరి వైద్య విధానాన్ని గమనిస్తే నేటి తరానికి అనేక సందేహాలు నివృత్తి అవుతాయి.

వంట ఇంటిలోనే ప్రపంచాన్ని దాచిన గొప్పతనం జానపద స్త్రీకే దక్కుతుంది. కరోనా వైరస్ లాంటి భయంకరమైన అంటు వ్యాదులకు సైతం మందును వంటిల్లె ఇచ్చిందని హైదరాబాద్ అడిషినల్ కమిషినర్ (క్రైం) షికా గోయల్ స్వానుభావంతో వంటింటి వైద్యం గురించి తెలియజేసారు. షికా గోయల్ తనకు కరోనా సంక్రమించిందని తెలసిన తర్వాత ప్రతిరోజు ఆవిరి పట్టడం, తులసి ఆకులు, పసుపు, మిరియాలు. అల్లం నీటిలో వేడి చేసిన మిశ్రమం వ్యాధిని నిరోదించడంలో సహకరించాయని తెలియజేసారు.

ప్రాచీన వైద్యం రోజురోజుకి కనుమరుగౌతుంది. వ్యక్తిగత శుభ్రత, శ్రద్ధ తగ్గిపోయి మనోదౌర్భల్యం,శారీరక సమస్యలు, అంతుచిక్కని వ్యాధులతో మనిషి నిరంతరం సతమతమౌతున్నాడు. గ్రామీణంలోనూ, పట్టణాల్లోను నేటికి చెట్ల మందులను వాడేవారున్నారు.
తలతిరుగుడు గడ్డ : తన కుతురికి గడ్డ తల దగ్గర మొదలై వైద్యం చేస్తుంటే మరో చోటుకి వెళ్లి అక్కడ పెరగడం, (పట్టిలు వేస్తే) దీనికి ఒక జానపదుడు మేడిపాలతో ఒక కొత్త బట్టను తడిపి ఆ గడ్డపై వేస్తే అది వేరే చోటికి వెళ్ళకుండా అంతరించిపోయిందని, మరియు తన కొడుకుకి చెవిలో ఏకదాటిగా చీము కారడం తగ్గకపోగా అనేక ఆంగ్ల మందులు (నేటి వైద్యం) వాడినా ఫలితం లేకపోవడంతో జానపద వైద్యాన్ని ఆశ్రయిస్తే చెవిలో చెట్ల మందు పోయగా చీము కారడం తగ్గిపోయిందని కొండ భాగ్యలక్ష్మీ గారు చెప్పారు. (కొండ భాగ్యలక్ష్మీ 65 సంవత్సరాలు, వైశ్య, హౌసింగ్ బోర్డు కాలని, కరీంనగర్)

అర్ష జ్వరం/ వరస జ్వరం : జ్వరం క్రమంతప్పకుండా దినం తప్పించి దినం వస్తువుంటే బెల్లం తులసి ఆకులను కలిపి మెత్తగా నూరి మింగించేవారు. ఈ ద్రావణం చక్కని ఫలితాలను ఇస్తుంది.
నొప్పులు : శరీరంలో ఏ భాగంలోనైనా నొప్పి కలిగితే ఆ నొప్పి తగ్గడానికి అడవి దొండాకు మరియు దొడ్డు ఆయిందాలను వేయించి నూరి తట్టుతో కడితే నొప్పులు తగ్గిపోతాయి.

శరీరంపై మచ్చలు : చిన్న పిల్లలకు శరీరంపై ఎవైన మచ్చలు ఏర్పడితే బచ్చలాకు నూరి పెడితే మచ్చలు మాయమౌతాయి.

తామర, గజ్జి, దురద : శరీరంపైన, చంకలో, గజ్జల్లో. ఏర్పడిన తామర, గజ్జి, దురద తగ్గడానికి పసుపు ముదిరిన వేపాకులని దంచి ఆ భాగాలపై మర్ధన చేస్తే పై వ్యాదులు సమూలంగా తగ్గిపోతాయి.

దగ్గు : దగ్గు విపరీతంగా బాధిస్తుంటే పసుపు మరియు ఓమ మిశ్రమం క్రమంతప్పకుండ తీసుకుంటే తగ్గిపోతుంది.

మదుమేహం వ్యాధి : మదుమేహ వ్యాధి తగ్గడానికి వేపాకులు, అలోవీర, కాకరకాయ మొదలైనవి తినడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చు.

మూత్రపిండాలలో రాళ్ళు : మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్ళు మూత్రం ద్వారా బయట పడిపోవటానికి ఎక్కువ మంచి నీటిని, ఈత చెట్టు నీర ని, ఈత కల్లుని, బ్రయోఫిల్లం ఆకులని, మక్కపిచుని నీటిలో మరగించి తాగడం వలన వీటి బాధ తగ్గుతుంది.

ఎముకలు విరగడం : విరగిన ఎముకలను అంటడానికి కాచిన నూనెతో రాయడం (మర్దన చేయడం), కంక బొంగులతో అంటుకట్టడం, కిరోసిన్ తో రాయడం వలన విరిగిన ఎముకలను అంటించవచ్చు. ( చిర్నేని రవి, 25 సంవత్సరాలు, మున్నూరు కాపు, బీర్పూర్, జగిత్యాల)

పై విధంగా ఆపత్ సమయాలలో జానపదులు వ్యవహరించి తమ వ్యాధులను నివారించుకోవడం నేటికి గ్రామాల్లో కనిపిస్తుంది.

                                                                                                                            — భోజన్న

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)