నాన్న ఎందుకో….!!!(కవిత )-సుధామురళి

నాన్న ఎందుకో ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటాడు
నీకు నడకలు నేర్పిస్తూ తనకు పరుగులు వచ్చన్న
విషయాన్ని మరచిపోయి జీవిత పందాన ఓడిపోతుంటాడు

నిను భుజాలపై మోస్తూ తన బతుకు బరువవుతుందన్న

సంగతిని వదిలేసి నీ భవిష్యత్తు

శిఖరానికి తాను పునాదిగా మిగిలిపోతాడు

నీ ఆటల్లో ఆయన గెలుపుని వదిలేస్తాడు
నీ అలకలకు తన ఆనందాన్ని రాసిచ్చేస్తాడు
నీ బతుకు చీకటిని తొలగించేందుకు

తన శ్రమ దీపాన్ని ధారపోస్తాడు
నీ మార్గాన్ని సుగమ పరచేందుకు

తన చేతులని ముళ్లకు ఆహుతిస్తాడు
నీ నవ్వులో మునకలు వేస్తూ
నీ గెలుపులో ని మత్తుని ఆస్వాదిస్తూ
తన కన్నీటిని మరచిపోతాడు
తన కష్టానికి ఇష్టాన్ని జత చేస్తాడు

నువ్వు ఓడిన వేళ తాను ఖిన్నుడై
నువ్వు జబ్బున పడితే తానే మందై
నీ అడుగు కింద మట్టై
నీ తలపైన ఆకాశపు గొడుగై
తనవల్లే నువ్వు పుట్టావని మరచి
నీ వల్లే తాను బ్రతుకుతున్నట్టు
తానంతా నువ్వై నిలుస్తాడు
నీ నిలువెల్లా తానై తరిస్తాడు
అందుకే నాన్న ఓ త్యాగ ధనుడు

-సుధామురళి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

4 Responses to నాన్న ఎందుకో….!!!(కవిత )-సుధామురళి

 1. G.Madhusudanaraju says:

  అంతా నాన్ననే చేస్తూఉంటే అమ్మ టీవీసీరియల్ చూస్తూ నిన్ను పట్టించుకోలేదా? లేక అమ్మే లేదా?
  అమ్మలు పిల్లలను పట్టించుకోవటంలో వెనుకబడి బడుద్ధాయిలుగా మారి పోయారన్నమాట.
  మీ నాన్నలాంటినాన్నదొరకటం మీ అదృష్టం .

 2. Vasantha kumari says:

  చాలా బాగా ఉంది సుధ👏👏👏
  Keep rocking

 3. Vasantha kumari says:

  Super sudha,👏👏👏
  Keep rockingg

 4. మహబూబ్ బాషా చి ల్లెం says:

  కవిత చక్కగా ఉంది
  కవయిత్రి గారికి
  అభినందనలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)