వివక్ష పర్వం(కవిత )–యల్ యన్ నీలకంఠమాచారి

వివక్ష వివక్ష
ఏమిటి వివక్ష
చెట్టుకి పుట్టకి గుట్టకి
పశువుకి పక్షికి పురుగు పుట్రకి
పట్టని ఈ విపరీత రోగం
నీకెందుకు నేస్తం
కులం మతం జాతి తెగ
వర్ణం వర్గం వైవిద్యం
కలగలిసిన జీవన యానంలో
వివక్ష ఓవిషపు కలుపుమొక్క
పీల్చే ప్రాణ వాయువుకు
కురిసే వాన చినుకుకు
పంట నిచ్చే భూమాతకు
లేని వివక్ష నీకేల నోయి
వంట్లో పారే రుధిరంలో
కంట్లో చిందే అశ్రుజలంలో
వంటికి పట్టే స్వేదంలో
కనిపించని వివక్ష నీకేలనోయి
వీచే మలయానికి
కాచే సూర్యరశ్మికి
పూచే వెన్నెల కాంతికి
సోకని వివక్ష నీకేల నోయి
ఆస్తులు అంతస్థుల తేడాలు
కలిమి లేముల బేధాలు
కుల వర్ణ ప్రాంత వైషమ్యాలు
నీ వివక్షకు ప్రామాణికాలా
ఆపదల వేళ
అవసరాల వేళ
అగుపించని వివక్ష
అన్ని అమరిన వేళపొడ సూపుట ఏల
పుట్టు గిట్టు వేళ లేనిది
మద్యనున్నవేళపక్క జేరి
మనిషి మద్య అంతరాల
సృష్టించడం గమనిస్తున్నావా
మనిషికి మనిషికి
మనసుకు మనసుకు
మద్య వైషమ్యాల రగలించి
వైరుధ్యాల ఆజ్యంపోయుట చూస్తున్నావా
చారిత్రిక కఠోర వాస్తవాలు
జీవన పథంలోని అడ్డంకులు
కట్టెదుట కనిపిస్తున్నా
కళ్ళుండి కబోదిలా తిరుగుతున్నావా
చరిత్ర పుటలు రక్తాక్షరాలతో వ్రాయబడుతున్నా
ఈ వంకతో మేటి నాగరికతలు మన్ను పాలైనా
వక్ర బూద్ది మానలేక మరీ మరీ
వర్ణ వివక్ష బాట నడుచుట భావ్యమా
వలదు వలదు వివక్ష వలదు
వివక్షతతో కూడి మసల వద్దు
వివక్ష వీడి వివేచనతో సాగి
విలక్షణ జీవిగా నిలబడతావో
విశ్వ నరుడిగా ప్రణతులందుతావో
వివక్ష జాడ్యంతో పెడతోవలసాగి
విశ్వ వినాశ కారిగ మారతావో
నీవే నీవే నిర్ణయించుకో
చరితలో నీ పుటను నీవే లిఖించుకో
ప్రమోదమో ప్రళయమో
నీ చేతుల్లో నే వున్నది సూమా
జాగ్రత్త జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త
భావి తరాల భవితవ్యం
నేటి తరం నిర్ణయం పై వుందిసూమా
అందుకే చెబుతున్నా మిత్రమా
వైరుధ్యాలకు వివక్షతలకు
చరమగీతం పాడు
సమాజోధ్ధరణకుపాటుపడిన
సంస్కర్తలదారినెంచుకొని
సమాజ పునర్మిణమునకు పూని ముందుకు నడు
పది తరాలకు ఆదర్శప్రాయంగా
నిలు
భావి తరాలచే ప్రణతులందు

-యల్ యన్ నీలకంఠమాచారి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)