వీడని ఋతువులు-(కవిత )-డి.నాగజ్యోతిశేఖర్

 

 

 

 

ఆ చెట్టుకు కొత్తేంకాదు!
ఊపిరితీగల్లో వెతలబొగ్గుపులుసు

వాయువును నింపుకోవడం!
కణం కణంగా దహనమౌతూ
అనురాగ ఆక్సిజెన్ను ప్రసవించడం!

తనకు కొత్తేంకాదు!
రాలిన ఆకుల్లో పిట్టలెగిరిపోయిన గురుతుల్ని వెతకడం!
శిశిర రాత్రుల్ని కప్పుకొని
దుఃఖ గీతాలు ఆలపించడం!

ఎండసూదులు గుచ్చుకున్న పువ్వుదేహాలను కన్నీటిదుప్పటిలో చుట్టడం!
మంచు ముసుగేసిన పచ్చటిస్వప్నాల నదుల్ని దారువు దారుల్లో ఇంకించుకోవడం!

విరిగిన వెన్నెళ్లను పత్రదోసిట్లోకి
ఒంపుకొని సాంత్వన స్పర్శలద్దడం!
కాయలు కాచిన కొమ్మ తనువుపై విసిరేయబడ్డ
రాళ్ళ గుండెల్లో వేదనగేయాలు
రాయలేక విఫలమవడం!

ఆ తరుణితరువుకి కొత్తేం కాదు!
ఊపిరాడనివ్వని క్షణాలు గొడ్డళ్ళై తనలోకి దిగడం!
చీలిన తనువుని చితి గుమ్మంలో ఉంచినా పచ్చగా నవ్వడం!

ఎప్పుడో వచ్చే ఒకానొక స్వేచ్చావసంతానికై …
బంధం మన్నులో బతుకును పాతుకొని
ఎదురు చూపుల వెక్కిళ్ళు మింగడం!
వీడని నెత్తుటిఋతువుల్ని గుండెకు పూసుకోవడం
ఆమెకు కొత్తేంకాదు!

                                                                                    -డి.నాగజ్యోతిశేఖర్.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

One Response to వీడని ఋతువులు-(కవిత )-డి.నాగజ్యోతిశేఖర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో