కన్నీరు(కవిత) – గిరిప్రసాద్ చెలమల్లు

భౌతికదూరమా
సమయపాలనా
కఠినంగా
కర్కశంగా కాటేసింది

పురుగును వాళ్ళు సృష్టించలేదు
వాళ్ళు మోసుకూ రాలేదు
పొట్టకూటికోసమో దుకాణం

తెరచి మరువగా
నిబంధనను మించిన కాలం
చూసుకోలేదో
గిరాకీని వదుల్చుకోదల్చలేదో

లాక్ డౌన్ ఆంక్షల
పదిహేను నిమిషాల ఆలస్యం
నూరేళ్ళ జీవితాన్ని
కబళించింది

ప్రశ్న సహించని
రక్షక భటులకి
సెక్షన్ల వరద
శిక్ష లాకప్పులో

ఇదే మొదటిదీ కాదూ
ఇదే చివరిదీ కాదూ

బలహీనుడెప్పుడూ
మరణం చేరువలోనే
అది నాగరిక సమాజ ఒరవడి

చట్టపు అక్షరాలను
చుట్టపుచూపుగా చుట్టేసుకుని
కాలాన్ని మారుస్తూ
వీధుల్లో స్టేషన్లో రక్తాన్ని పారిస్తూ

కొట్టరానిచోటల్లా
చచ్చేదాకా కనికరం చూడని లాఠీ
అనారోగ్యపు పోస్ట్ మార్టం కాగితాలు
చితుల్లో తండ్రీకొడుకులతో పాటు
మసై పోయాయి

రాజ్యం రాజసంగా నవ్వుతుంది
ద్రవిడనేలలో కన్నీరు
ఇంకిన కావేరిని నింపుతుంది
(జయరాజ్ బెనిక్స్ మరణాలకు చలించి )

– గిరిప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)