బడుగు బతుకుల భారతం(కవిత )-బివివి సత్యనారాయణ

ముక్కోటి దేవతలున్న
నా పవిత్రభూమి భారతావనిలో
కోట్లకు పడగలెత్తిన ధనవంతులున్న
నా పుణ్యభూమిలో
లాక్డౌను సందర్భముగా నేడు
మనిషిని ఆకలి తరుముతూంది
కొందరి మనుగడను ఆకలి మింగేస్తూంది
బతుకుతెరువుకోసం పొట్ట చేతపట్టి
పట్టణానికని వలసవచ్చిన పేదలు,
బడుగు బలహీన బక్కచిక్కిన
వలక కార్మికులు
తినేందుకు తిండిలేక
కొనేందుకు చేతిలో డబ్బులేక
బండ్లు బస్సులు రైళ్లు బందయిన వేళ
వేలవేల మైళ్ళు కాలినడకల సాక్షిగా
వారివెతలు కథలుకథలుగా మీడియాగుండా,
పత్రికా పుటలనిండా పొంగి పొర్లుతుంటే,
బడాబాబులను విమానాల్లో రప్పించిన వారు
వీళ్ళను ఎందుకు విస్మరించారని?
కునుకు పట్టని తిండి సహించని నేను
దీనికి కారణమెవరని ఎవరిని ప్రశ్నించను?
ఇదంతా పేదల పాపమేనని, వారి ఖర్మయని సరిపెట్టుకోనా
లేక, అంతా ఈ కరోణా పుణ్యమేనని
మనస్సును జోకొట్టుకోనా !

సలసలకాగే మండే ఎండల్లో
సుళ్ళుత్రిప్పే ప్రేగుల ఆకలి ఆర్తనాదాలు
పంటిబిగువన అధిమిపట్టి
చంకల్లో కన్నబిడ్డల్ని హత్తుకుని
భుజాలపై మూటాముళ్లూ ఎత్తుకుని
సర్దుకున్న సంసారంతో ఇక పట్టణానికి సెలవంటూ బైచెప్పి
సత్తువ సన్నగిల్లగా, నడవలేక నడవలేక
నెఱ్ఱలుబారిన పాదాలు నడిరోడ్డును రక్తతిలకం అద్దుతుంటే
దాహంతీరే మార్గంలేక చెమటచుక్కల్నే దిగమింగుతూ
కళ్ళల్లో పెళ్ళుబికిన కన్నీళ్ళు రక్తపుచుక్కలై బొట్లుబొట్లుగా రాలుతుంటే
తరగని వందల వేల మైళ్ళు దూరం
దాటేందుకు వలసకూలీలు నడకబాట పడుతుంటే
ఇది ఎవరి పాపమని నిందించను?
కారణమెవరని ప్రశ్నించను?
ముక్కోటి దేవతలున్న ఈ పవిత్ర దేశంలో
కోట్లకు పడగలెత్తిన పెద్దపెద్ద ధనవంతులున్న
నా పుణ్యభూమిలో
ఇదంతా కరోనా పుణ్యమేనని మనస్సుని జోకొట్టుకోనా
లేక, పేదలబతుకుల్లో ఇది షరా మామూలేయని సరిపెట్టుకోనా !!

-బివివి సత్యనారాయణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)