గజల్-13  – ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

తెలుగు గజల్ ప్రేమికులకు నమస్సుమాంజలి. రచించడం అనే పదానికి ఎన్నో అర్థాలున్నాయి.
ప్రేమలో తలమునకలైపొతే ప్రియుడు / ప్రియురాలు తమ ప్రేమికులగురించి తప్ప వేరేదీ ఆలోచించరు.
ఏది వ్రాసినా ప్రేయసి లేదా ప్రియుడి మీదే వ్రాస్తారు. ప్రేమంతా రంగరించి దానితోనే కావ్యాలు వ్రాయడం ప్రణయవేదాన్ని వ్రాయడం , నీవు సగం నేను సగం అనుకుంటూ ఉమాశంకరుల వలెనే ఒకరిలో ఇంకొకరిని దాచుకొనే సూత్రాలను రచించడం , ప్రణయసమరంలో ప్రేయసిని/ప్రియుడిని గెలుచుకొనే వ్యూహాలను పన్నడం (వ్యూహరచన చేయడం ) ఇలాంటివన్నీ ఈ గజల్ లో కనిపిస్తాయి.

ప్రేమనంత రంగరించి కావ్యాలను రచిస్తాను
వలపంతా చిలకరించి భావాలను రచిస్తాను

ప్రణవనాద సంకీర్తన వింటానని అంటావు
ప్రణయరాగమాలపించు వేదాలను రచిస్తాను

ఉమకిశివుడు తనువులోని సగభాగం పంచాడు
ఒకరినొకరు దాచుకొనే సూత్రాలను రచిస్తాను

కైలాసపు పరమేశుని చేరాలని తపించకూ
మదిలో నిను బంధించే మంత్రాలను రచిస్తాను

మనని వేరుచేయు వ్య(శ)క్తి పుట్టలేదు “నెలరాజా “
నిన్నునేను గెలుచుకొనే వ్యూహాలను రచిస్తాను.

                                                                             -ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)