జ్ఞాపకం-49 – (ధారావాహిక )- అంగులూరి అంజనీదేవి

‘దీని బొంద. ఈ పిచ్చినుండి ఇదెప్పుడు బయటపడాలి ? ఈ ఇంటరెప్పుడు పూర్తి చెయ్యాలి ?’ అని హస్విత మనసులో అనుకుంది. ఇక అప్పటినుండి సంలేఖతో ‘ర్యాంక్ కొట్టేలా చదవ్వే’ అని మాట్లాడడం మానేసింది. తన చదువేదో తను చదువుకుంటోంది.

రోజులు గడిచిపోతున్నాయి.
హస్విత డిగ్రీలో చేరింది. దిలీప్ కూడా డిగ్రీనే. జయంత్ సి.ఎ.లో సీటొచ్చి వేరే కాలేజీలో చేరాడు. సంలేఖకి ఇంటర్లో రెండు సబ్జక్టులు పోయి ఇంట్లో వుంది. తిలక్ ది కూడా అదే పరిస్థితి. ఆరు సబ్జెక్టులు పోయాయి. తిలక్ సప్లమెంటరీ రాసినా పాసవ్వలేదు. సంలేఖ అసలు ఎగ్జామే రాయలేదు.

అది తెలిసి రాఘవరాయుడు “ఆడపిల్ల అది మేలు కదరా ! దానికి రెండు సబ్జెక్టులే పోయాయి. నీకు ఆరు. ఇలాగేనేరా చదివేది?” అన్నాడు నెత్తికొట్టుకుంటూ రాఘవరాయుడు.
గుర్రుగా చూశాడు తిలక్.

“బుద్దివుందారా నీకు? అందరెలా వున్నారు? నువ్వెలా వున్నావ్? ” అన్నాడు నెత్తికొట్టుకోవటం ఆపి.
పిచ్చెక్కినట్లు ఎగిరాడు తిలక్.

“ఎన్నిసార్లు చెప్పాలి నాన్న నీకు? పోలిక మంచిది కాదని. ఇదే విషయాన్ని పర్సనాలిటీ డెవెలప్ మెంట్ పుస్తకాలు రాసేవాళ్లు , టీవీ చానల్స్ వాళ్ళు అందరికీ విన్పించేలా చెబుతూనే వున్నారు. అలాంటివేం వినవు నువ్వు. అవకాశం దొరికితే చాలు వాళ్లబ్బాయిని చూడరా. వీళ్లబ్బాయిని చూడరా. వాళ్లు నీతోటే చదువుతున్నారు. నువ్వూ వున్నావ్ ఎందుకు? అంటావ్. వాళ్లలాగే ఎందుకుండాలి నేను ? నేను నాలాగే ఉంటాను. నన్నెప్పుడూ చెల్లెలుతో పోల్చొద్దు. అలా పోలిస్తే అదంటే నాకు కోపం పెరుగుతుంది. తిట్టేదేదో సూటిగా నన్నే తిట్టు” అన్నాడు తిలక్.

“నీ ముఖం నాకు చూపించకు. వెళ్లరా !” అన్నాడు కోపంగా, అసహ్యంగా చూస్తూ రాఘవరాయుడు.

“వెళ్లటానికి నేనేం తప్పు చేశాను. నాతో పాటు చాలామంది ఫెయిల్ అయ్యారు. వాళ్లంతా ఇంట్లో వుండకుండా వెళ్లిపోతున్నారా? నేను గనుక వెళితే మళ్లీ రాను. కావాలంటే ఇప్పుడే వెళ్తాను చూడు” అన్నాడు. అనడమే కాదు. అప్పటికప్పుడే ఇంట్లోంచి వెళ్లబోయాడు..

అది చూసి అక్కడేవున్న సులోచనమ్మ, రాజారాం వణికిపోయారు. వీడు అన్నంత పని చేస్తాడు అన్నట్లు వెంటనే వెళ్లి తిలక్ ని పట్టుకున్నారు.

“ఆయన అలాగే అంటారు. తండ్రి కదా! ఓపిక పట్టు తిలక్! ఏదో కోపంలో అంటే నిజంగానే వెళ్లిపోతావా?” అంటూ తిలక్ ని బ్రతిమాలింది సులోచనమ్మ.

“వెళ్లక ఆయన చేత తిట్టించుకుంటూ ఎన్ని రోజులుండాలి? సబ్జెక్టులు పోతే మళ్లీ కట్టుకొని పాస్ కానా? ఇలాగే వుంటానా ? అది చెప్పు ఆయనకి. లేకుంటే బి.పి. పెరిగేలా వుంది” అన్నాడు తిలక్.

రాజారాం తండ్రి వైపు చూసి “నువ్వు కూడా ఏంటినాన్నా! పడితే వాడి వెంటే పడతావు. మళ్లీ రాస్తానంటున్నాడుగా. వదిలెయ్. ఇవాళ రేపు రోజులు బాగలేవు. బయటకెళ్లి వాడెలా బ్రతకాలి?” అంటూ నచ్చ చెప్పాడు.

ఆయన నుదుటి మీద బాధగా రుద్దుకుంటూ “రాజారాం! నీకు నా బాధ అర్థం కాదురా. వాడిని నేను అనేదే మీకు కన్పిస్తుంది. నాకేమో వాడి భవిష్యత్తు కన్పిస్తుంది” అన్నాడు.

“వదులు అన్నయ్యా! నేను వెళ్తాను. ఆయనకేదో నా భవిష్యత్తు కన్పిస్తుందట” అంటూ గింజుకున్నాడు తిలక్.

అది చూసి రాఘవరాయుడు “వాడ్ని వదులు రాజారాం! బయటకెళ్లి ఏ దొంగతనమో చేసుకుని బ్రతుకుతాడు” అన్నాడు.

సులోచనమ్మ తల్లడిల్లిపోతూ, రోషంగా చూసి “వాడ్ని దొంగతనం చేసుకుని బ్రతకమని మీరే చెబుతున్నారా? ఒక తండ్రి చెప్పాల్సిన మాటలేనా అవి? ఎందుకండీ వాడ్ని మరీ అంత చిన్న చూపు చూస్తారు?” అంది.

ఆమెకు కన్నీళ్లు ఆగడం లేదు..

“చూడక వాడు చదివే చదువుకి ఐ. ఎ. ఎన్. ఆఫీసరవుతాడనుకుంటున్నావా? వాడ్ని వెనకేసుకురాకు. అసలే చెడిపోయి వున్నాడు” అన్నాడు అవేశంగా రాఘవరాయుడు.

తల్లీ, దండ్రీ అలా కేకలేసుకుంటుంటే భయంతో ఊపిరి బిగబట్టింది సంలేఖ. చుట్టుపక్కల వాళ్లు వింటారేమోనని వెళ్లి తలుపులు మూసి వచ్చింది. ఆమెకు ఎప్పుడు ఇంట్లో గొడవ జరిగినా గుండెలు దడదడ కొట్టుకుంటుంటాయి.

“ఎందుకే తలుపులు మూస్తావు? వాటిని పగల గొట్టుకునైనా బయటకెళ్తాను. ఆగుతాననుకుంటున్నావా?” అన్నాడు తిలక్ సంలేఖ వైపు చూసి.

భయంతో వణికిపోతోంది సంలేఖ. తిలక్ కోపంగా వున్నప్పుడు ఆ చుట్టు పక్కల వుండాలనిపించదు. ఎటైనా పారిపోవాలనిపిస్తుంది.

– అంగులూరి అంజనీదేవి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

జ్ఞాపకం, ధారావాహికలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో