గజల్ -12 ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

తెలుగు గజల్ ప్రేమికులకు నమస్సుమాంజలి. సినీగీతాలను వ్రాసే కవులు(మగవారు)
ఆడవారు విరహతో పాడే పాటలు కూడా ఎన్నో వ్రాసారు. అలాజె గజళ్ళు కూడా వ్రాస్తే ఎలా ఉంటుందోనని
అనుకోని వ్రాసిన గజల్ ఇది. కన్నె సొగసులు ప్రియుడి కళ్ళతోనే భద్రంగా ఉంటాయని అనుకున్న కన్నెమనసు వ్రాసుకున్న భావనతో మొదలుపెట్టాను. పరువాలకు పొన్నాలతో మెరుగుపెట్టడం , ప్రేమరాత్రులలో తలపుల చిలుకలు చుట్టడం , రాత్రిలోని క్షణాలను మోసేందుకు స్వప్నసుమాల పల్లకీని తీసుకురావడం , చందమామలాంటి తన రాజు వచ్చే వేళలో వెన్నెలతిలకం దిద్దుకొని ఉండడం, అలాగే జలకాలాడేందుకు పుష్కరిణిలోని నీరు తెచ్చేలోగా తన అందాలకు ఎదురుచూపులతో నలుగుపెట్టానని చెప్పడంలో చదువరికి ఓ విరహోత్కంఠిత కనులముందు సాక్షాత్కరిస్తుంది.

గజల్;-

సొగసంతా నీకన్నులలోన దాచి ఉంచాను
పరువాలకు పొన్నలతో మెరుగుపెట్టి ఉంచాను

ప్రణయాలను పండించే వేళైనది ప్రియనాథ
తలపులన్ని చిలుకలుగా చుట్టి పెట్టి ఉంచాను

రాత్రిలోని క్షణాలన్ని బోయీలుగ మారినవి
కలలపూలపల్లకీని తెచ్చిపెట్టి ఉంచాను

ప్రాణేశుని హృదయానికి గంధాలను పూయాలి
విరులన్నీ పానుపుగా పరిచిపెట్టి ఉంచాను

నాకోసం నెల(నా)రాజే వస్తాడని తెలుసులే
నుదుటిపైన వెన్నెలనే దిద్దిపెట్టి ఉంచాను

తీపిముద్ర వేయమంటు తొందర పెడుతుంటావు
అరచేతిని పెదవులపై అడ్డుపెట్టి ఉంచాను

కనుపాపల గూళ్ళలోన ఊపిరాడకుందేమొ
కనురెప్పల కిటికీలను తెరిచిపెట్టి ఉంచాను

జలకమాడ నీరడిగితె పుష్కరిణికి వెళ్ళావు
అందాలకు ఎదురుచూపు నలుగుపెట్టి ఉంచాను

-ఆర్ వీ ఎస్ ఎస్ శ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)