జన పదం జానపదం -జానపదుల వైద్య విధానం-తాటికాయల భోజన్న,

మానవ సృష్టిలో వైద్యం ఒక అద్భుతాంశమే. పుట్టిన ప్రతి జీవి తప్పక మరణిస్తుంది. ఈ భూమిపై ఏ జీవి ఎంతకాలం జీవించి ఉంటుందో అనేది సమాధానం లేని ప్రశ్న. వయస్సు మళ్ళి మరణించే జీవులకంటే రకరకాల వ్యాధుల బారినపడి మరణించేవే ఎక్కువ అని చెప్పాలి. మానవ పరిణామక్రమంలో మనిషి చెట్ల రసాలతో వ్యాధులను ఎదుర్కోనే దశకు చేరుకున్నాడు. రానురాను వ్యాధి రాకమునుపే వైద్యం చేసుకునే విపరీత దశలో కొనసాగుతున్నాడు. కాని జానపదులను గమనిస్తే వ్యాధి సంక్రమించిన తరువాత దాని లక్షణాలను పరీక్షించి వైద్యం చేయడం కనిపిస్తుంది. ఈ వైద్య విధానం ఎక్కువ కాలాన్ని తీసుకున్ననూ రోగికి మరేవిధంగా హాని చేయదు. నేటి వైద్య విధనంలో ఎక్కువ మోతాదులో మందులను వాడడం మనకు కనిపిస్తుంది.

వైద్యం అందని గ్రామాలు, అందుకోలేని ప్రజలు నేటికి గ్రామీణ నాటు లేదా మోటు వైద్యంపై అధారపడి జీవిస్తున్నారు. తక్కువ ఖర్చుతో రోగాన్ని నయం చేయడం ఇక్కడ సాధ్యమైతుందని గ్రామీణులు చెబుతుంటారు. కొందరు వైద్యులు నయపైసా తీసుకోకుండానే వైద్యం చేయడం అక్కడక్కడ కనిపిస్తుంది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నకిలి వైద్యులు పుట్టుకొచ్చి దీనిని ఒక వ్యాపారంగా కూడా మార్చివేశారు.

జానపదుల వైద్యం అనేక రకాలుగా ఉంటుంది. ఇది వైద్యున్నిబట్టి మారిపోతుంది. ఒక్కో వైద్యుడు ఒక్కో రకమైన చెట్లమందులను వాడుతూ వ్యాధిని నివారించడం కనిపిస్తుంది. పెద్దాసుపత్రిలో నయంకాని వ్యాధులు చెట్లమందులతో నయం అవుతున్నాయని ప్రజలు కథలు కథలుగా నేటికి చెన్నుకోవడం కనిపిస్తుంది. జానపదులు స్త్రీ, పురుష బేధం లేకుండా వైద్యాన్ని ప్రవృత్తిగా ఎన్నుకుంటారు. అదేవిధంగా అందరికి వైద్యసేవలను అందిస్తారు.

జానపదులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. ఈ వృత్తి చాలా కష్టమైనది. కాబట్టి శారీరకంగా మరియు మానసికంగా అనేక అవస్థలను గురివౌతాడు. వీరి జీవన విధానాన్ని అనుసరించి, పేదవారు కావడం వలన ఆధునిక వైద్యాన్ని అందుకోలేక కొందరు నాటు వైద్యాన్ని అనుసరిస్తున్నారు. గ్రామీణులేకాకుండా నగరంలో జీవించే వారిలో కొందరు నేటికి నాటు వైద్యాన్ని నమ్ముకొని జీవిస్తున్నారు.
జానపదుల వైద్యం ఇంటినుండే మొదలౌతుందనేది తెలియని వారుండరు. చిన్న చిన్న సమస్యలకు వంటింటి పోపుల డబ్బే పరిష్కారం చూపిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే గృహం ఒక చిన్నపాటి వైద్యశాలే. ఇంటిలోని పెద్దవారైన బామ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, అమ్మలు అందరు ఇక్కడ వైద్యులే. అంతేకాకుండా వీరితో నివసించే చిన్నపిల్లలుసైతం కొన్ని వైద్య చిట్కాలను నేర్చుకుంటారు.
వీరు దగ్గుకి ఓమ, తులసి ఆకులు, గొంతు నొప్పికి మిరియాలు, జీలకర్ర రసం, రోగ నిరోధక శక్తికి పసుపు కలిపిన తేనే, జలుబుకి వేడి నీటిలో పసుపు ఆవిరి, తులసి ఆకుల రసం, నిమ్మ ఆకులు, పూదీన, కొత్తిమీర, చింతపండు ఇలా ఒకటేమిటి ఇంటిలోని ప్రతి వస్తువు పనిచేస్తుంది. కాబట్టే కరోన వైరస్ విజృంభనలో కూడా వంటగదికే పని పెంచి రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని విజ్ఞులు చూసిస్తున్నారు.

-తాటికాయల భోజన్న

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కాలమ్స్Permalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)