భారతీయ కుటుంబం(కవిత )-యల్ .యన్. నీలకంఠమాచారి

కుటుంబం ఇది కుటుంబం
జీవనయానంలో తొలి ప్రస్థానం
పాత రాతి యుగ ఆరంభం నుండియే
రూపు దిద్దుకున్న మేటి వ్యవస్థ
పరస్పర సహకారానికి తొలి వేదిక
తెలియని అనుబంధానికి ఓ సూచిక
జీవన పరిణామ క్రమంలో
ఎన్నెన్నో మార్పులు పొడసూపినా
జీవనశైలిలో కొత్త అనుభవాలెదురైన
ఏనాటి కానాడు నూతనత్వాన్ని సంతరించుకున్నది
పాత తరాలకు ఆసరాగా
భావి తరాలకు ఆలంబనగా
విలువల పునాదులపై
వెలసిన మానవతా భవంతి
అనంత కాలచక్ర భ్రమణంలో
యుగాలు తరాలు వత్సరాలు
నిరంతరం గడిచి పోతున్న
సుస్థాపితమై నిలుచున్నది
కాలానుగుణ మార్పులు వచ్చి
ఉమ్మడి వ్యవస్థ వ్యక్తి వ్యవస్థగా మారినా
పెద్ద చిన్న కుటుంబాలుగా రూపాంతరం చెందినా
మూల ప్రామాణికాల మరవని వ్యవస్ఠ
ఆధునికతల గాలులు వీచినా
అతఃక్లేశాలు ప్రభావం చూపినా
అంతరాల అడ్డుగోడలు పెరిగినా
మనసు పొరల్లో ఏదోమూల చివురించేది
పిల్లల నడకకు నడతకు
వారల బాగోగులకు
వారి ఉజ్వల భవితకు
దిశ దశ నిర్ధేశించేది
ప్రేమ వాత్సల్యము
దయ కరుణ అభిమానం
వియ్యం నెయ్యం సోదరభావం
కలగలసిన విలక్షణ వ్యవస్థ
అసూయ ద్వేషాలు
అనుమాన అవమానాలు
కోపాలు తాపాలు పగలు కార్పణ్యాలు
తాత్కాలికాలే కాని శాశ్వితాలు
కాని వ్యవస్థ
ఇదే ఇదే భారతీయ కుటుంబవ్యవస్థ ప్రాశస్థ్యం
వసుదైక కుటుంబప్రామాణికం
విశ్వానికంత ఆదర్శ ప్రాయం
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవ వేళ
భారతీయ కుటుంబానికి నే చేస్తున్న
హృదయ పూర్వక శిరః ప్రమాణం

-యల్ యన్ నీలకంఠమాచారి నంద్యాల

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)