నువ్వే నేనవుతుంటే…(కవిత )-నాగాభట్ల గాయత్రి శంకర్

నన్ను నేనే ఇచ్చుకోనా
నేస్తమల్లె నడిచిరానా…

నువ్వు నడిచే దారిలోనా
నీడ నేనై చేరుకోనా…

అనుదినము జ్ఞాపకమల్లే
అరక్షణమూ ఆగని ముళ్లై
నీ తోడు కోరే చెలినై
ఏనాడూ చెదరని కలనై
వసంతాల ప్రేమ వరమీయగా
వాడిపోని వరమాలై వేచెగా
విడువనంటూ చేసిన బాసలు విడిది చేయగా
ఆనందభాష్పాల ఆవిరులు అక్షింతలై అలరగా
తలపుల తలంబ్రాలు తలని చేరి
కోరిన కొంగుముడి కానుకగా మారి
తనువు తాంబూలమై నిను చేరేవేళ
ఎదురు చూస్తున్నా నీ కోసం
కోరుతున్నా కలకాలం నీ సావాసం…!!

-నాగాభట్ల గాయత్రి శంకర్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలుPermalink

Comments are closed.