వసుధైక కుటుంబం!(కవిత )-నూజిళ్ళ శ్రీనివాస్

భారత దేశపు తత్త్వం ఒకటే “వసుధైక కుటుంబం”
భారత దేశపు మంత్రం ఒకటే – విశ్వశాంతి మంత్రం
భారత దేశపు భావన ఒకటే – సకల జీవ సౌఖ్యం
భారత దేశపు జీవనమొకటే – కరుణ, ప్రేమ భరితం!
*
మానవత్వపు మనుగడ కోసం కుటుంబ వ్యవస్థనిచ్చింది
వన్నెతరగని విలువలు నింపి వ్యక్తిత్వాన్ని మలచింది
సాటి వారికీ సాయం చేసే సంస్కారాన్ని నేర్పింది
తరతమ భేదాలను మాపే సమ-రసతను మదిలో నింపింది!
*
తల్లినీ, తండ్రిని, గురువును, అతిథిని దైవాలుగ పూజించింది
శరణు వేడితే శత్రువునైనా ఆదరించమని తెలిపింది
జన్మభూమియే స్వర్గం కన్నా మిన్నను భావన నింపింది
ఆర్ష ధర్మమే అయుధమ్ముగా లోకమంతటిని గెలిచింది!
*
విజ్ఞానం విశ్వానికి పంచి విశ్వగురువుగా వెలిగింది
విదేశాలపై దాడి చేయక విశ్వ శాంతినే కోరింది
ఆపదవేళ ఆదరించుతూ విశ్వమాతగా మారింది
అధినేతల హృదయాలను గెలిచి విశ్వ విజేతగ నిలిచింది!

*
– నూజిళ్ళ శ్రీనివాస్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)