#మనసు#(కవిత )-స్వాతికృష్ణ సన్నిధి

 

 

 

 

బాధ తొంగిచూసే వేళ..

బంధువైన నేత్రాలకు చెప్పుకుంటే..

భారాన్ని మోయలేని కనురెప్పలు విలవిలలాడుతూ…

జలజల రాలుస్తున్న కన్నీరు పెదవులంచుకు చేరగానే…

చెంపను తాకిన చేతిస్పర్శకు ఊరడిల్లుతూ…

తనకు తానే ఓదార్పవుతుంది “మనసు”…

సంతోషం దరి చేరినపుడు..

ఆకాశాన్నంటిన పుర్ణమి చంద్రునిలా వెలిగిపోతూ..

ఆనందాన్ని అందరికీ పంచాలని ఉవ్విల్లూరుతూ…

ఉల్లాసంగా ఉరకలు వేస్తుంది “మనసు”..

పలువురికి నచ్చాలన్నా…

నలుగురు నీతో జత కట్టాలన్నా…

కల్మషమే లేని ఆత్మ సౌందర్యం మిన్న…

మబ్బు కమ్మిన జాబిల్లిలా మసకబారనీయకు మనసుని…

నిలువుటద్దమై చూపిస్తుంది మనసే నీ ప్రతిరూపాన్ని…

 -స్వాతికృష్ణ సన్నిధి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.