ఆక్రోశం'(కవిత )-సుజాత.పి.వి.ఎల్

ఇప్పుడు నా బ్రతుకుని నరకంగా మార్చాలని
ప్రయత్నించే నవ్వులు నా చుట్టూ ఉన్నాయి
వెక్కిరింపులు, వెటకారాలూ
సూటీ పోటీ మాటలు భరించడం
నా దినచర్యలో భాగమైపోయింది
భరించలేక మనసుకి కంచె కట్టి
బంధించాలని చూశా… కానీ..
వద్దనుకున్నా అది నీ చెంతకే చేరింది!

నిన్నటివరకూ నీ పలుకుల ప్రవాహంలో
నిలువెల్లా తడుస్తూ పులకించిపోయిన నేను
ఇప్పుడు ఈ దుఃఖంలో ఊపిరి అందక
వెక్కెక్కి పడుతున్నా..!

నింగి మబ్బుపట్టి ఉదా రంగులోకి మారింది
నా మనసులాగే..
రెండూ కురవడానికి సిధ్ధంగా ఉన్నాయి
నా మీద ఒక్క పిడుగు పడితే బావుంణ్ణు!
దాన్ని మింగేసి ఆ శక్తితో
నా చుట్టూ కట్టబడ్డ కంచెని
భస్మం చెసేస్తాను!!
నీ దూరాన్ని ఓర్చుకోగలుగుతున్న నాకు
పిడుగుని మింగడం పెద్ద కష్టమేమీ కాదులే!!

అనంతానికి నిదర్శనం ఆకాశమైతే
ఆకాశమంత ప్రేమకి నిదర్శనం నువ్వు!
నాకు కూడా ఆకాశంలా మారిపోవాలని ఉంది!
ఉరుములు, మెరుపులు, తూఫానుల రూపంలో
నా ఆక్రోశాన్ని ప్రదర్శించాలని ఉంది..!!

–సుజాత.పి.వి.ఎల్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)