అనంతలక్ష్మి( కవిత) – సేద దీరనీ

ఆమె చూపెక్కడో
ఆకాశంలో చిక్కుకునుంది
గడియారపు ముల్లుతో
పోటీ పడ్డ రోజులన్నీ
కనుమరగవుతున్నాయ్
అష్టావధానం చేసిన అరచేతులు
అంగుళం మేరైనా కదలనంటున్నాయ్
బంధాలూ బాంధవ్యాలూ
సంకెళ్ళై చుట్టుకుంటుంటే
ఈ సాంసారిక పంజరంలో నుండి
మనసు స్వేచ్ఛను కోరుకుంటోంది
కాళ్ళ కడ్డుపడుతూ
అనుక్షణపు అప్రమత్తతలూ
అధికారిక స్వరాలూ అజమాయిషీలూ
పులుముకున్న కృత్రిమ నవ్వులూ
ఇక చాలని పిస్తోంది
ఆమెకిక తనదైన లోకంలో
విహరించాలని ఉంది
ఆంక్షలు లేని లోకానికి
రెక్కలు విప్పార్చి ఎగరాలని ఉంది
ఆమె చూపులు
ఇక ఏ చట్రంలోనూ ఇమడేవి కావు
బాధ్యతల బరువుతో కృంగిన
భుజాలకి ఆసరా అవుదాం
ఇంకెన్నాళ్ళు నీదైన లోకానికి
ఆమె కావలి కావాలి
తా కోరుకున్న ప్రపంచానికి
తనని రాణిని చెయ్
తా వలసిన విధాన బతకినియ్
కర్తవ్య నిర్వహణలో అలసిన
ఆ మనిషినీ మనసునీ సేదదీరనీ

-అనంతాభిరుచి

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)