దృశ్యం (కవిత )– గిరిప్రసాద్ చెలమల్లు

నా చుట్టూ నీళ్ళు
నీళ్ళ చుట్టూతా చిట్టడవులు
నాపై ఎన్నో జీవరాశుల జీవనం
ప్రకృతి ఒడిలో
ఇదంతా నా గతం

ఇప్పుడూ నీళ్ళున్నాయి
అడవిలేదు
వలస పొలోమంటూ విరుచుకుపడితే
మనుషులంతా నాపై పడ్డారు
కనబడ్డచోటల్లా ఇరుకిరుకు ఆవాసాలు
వృత్తులన్నీ ఓ చోటచేరిన అపురూప దృశ్యం

కాలు తీసి కాలు వేయలేని జాగాలో కాపురాలు
నాలుగోతరానికి ఊపిరి పోసిన నా జవసత్వాలు
సాంద్రత సక్కనైన ఏటిని మురికిగా మారుస్తున్నా
స్వచ్ఛ భారత్ గోడలపైనే తళుక్కు మంటుంది

ఒక్కో ఇల్లు ఒక్కో వస్తూత్పత్తి కర్మాగారం
క్రయవిక్రయాల బహిరంగ మార్కెట్
సర్వమత సంస్కృతులు విరాజిల్లే బజార్లు
పూలమొక్కలూ కిటికీలనెక్కి కనులవిందు జేయు
సృజనాత్మకత గడప గడపలో

ఎన్నెన్నో ఆటుపోట్లు ఎదురైనా
అంటువ్యాధులు ప్రబలినా
సడలని ఆత్మవిశ్వాసం నా జనుల్లో
భౌతిక దూరం పాటించ చోటు లేక
లోకం నోట్లో నానుతున్నా
నేనోద్వీపాన్ని
నేనే ధారవిని

                                                                       – గిరిప్రసాద్ చెలమల్లు

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)