“జననే విశ్వ నెనరు”(కవిత )-బి.మహేష్

నాన్న అసహాయుడై
కొట్టిన రోజులున్నాయి అయినా

అమ్మకు ఓదార్చుచుకునే శక్తి
పిల్లలు ఆగ్రహంతో ఊగిపోయిన ఘడియలున్నాయి

అయినా అమ్మకు నిగ్రహించుకునే ధైర్యం
ఉదయాన్నే పొయ్యిలో నిప్పుతో చెలగాటమాడుతూ
వాకిట్లో కన్నీళ్ల కల్లాపి చల్లుతుంది
ఇంటి ముందు వేసే ముగ్గులెన్ని చుట్లు తిరుగుతుందో

అమ్మ జీవితంలో అన్ని ముడులు
ఏర్పడి ఉంటాయి
అమ్మకు ఆకలి బాధ తెలుసు

అందుకే అమ్మా అని పిలిచినా వారికి
అన్నం పెడుతుంది
చేతనైన వండుకోలేక ఖాళీ కడుపుతో

ఉండే వారున్నారేమో కానీ
జ్వరం వచ్చినా ఖాళీకడుపుతో పండుకోబెట్టిన అమ్మయితే లేదు
నాన్న చేసే ఉద్యోగానికి ఇంత వెల (వేలల్లో)

ఉందేమో కానీ పొద్దస్తమానం అలుపు, సొలుపు

తెలియకుండా చేసే అమ్మ ఉద్యోగానికి(పని) వెలకట్టలేము
అమ్మ చేసిన వంట రుచి ఎరిగిన వారుంటారు

కాని అమ్మ మనసు ఎరిగిన వారు తక్కువే
అమ్మను పలకరించే వారు ఇంట్లో ఉన్నారో లేదో కానీ
అమ్మ కలువరించేది మాత్రం ఇంట్లో వారినే
ఆదిపరాశక్తులైనా దేవతలు కూడా కోపంతో

అప్పుడప్పుడు ఊగిపోతారేమో కానీ
అమ్మకు ఆ దేవతల కంటే
సహనం ఎక్కువే
ఎవరిపైన, ఏనాడూ కోప్పడ్డది లేదు
నిగ్రహం – అనుగ్రహం ఎక్కువే
అందుకే
అందుకే
అమ్మనే విజేత
జగజ్జేత

                                                                            –బి.మహేష్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)