మనిషినే (కవిత)- గోదారి రామయ్య

కంటి మీద కునుకు వచ్చీ రాకున్నా
రేపటి కోసం కలలు కంటున్నా

మనసు కలవరపడుతున్నా
ఆశతో బ్రతికేస్తున్నా

సాటి మనిషి కానొచ్చినా
ఆరడగుల ఆవల ఉంటున్నా

స్వచ్చమైన గాలి (ఇప్పుడు) వీస్తున్నా
ముక్కుకు అడ్డు కడుతున్నా

ఎంత విచిత్రమో
వైరాణువు విపరీతమో
నేను చేసుకున్న కర్మమో
ప్రకృతి తల్లి ఎన్నటికి క్షమించునో!

ఇంతటి విపత్తులోనూ
రైతునై పండిస్తున్నా
కూలీనై శ్రమిస్తున్నా
వైద్యుడినై ప్రాణం పోస్తున్నా
పోలీసునై కాపాడుతున్నా
పారిశుధ్య కార్మికుడినై శుభ్రం చేస్తున్నా
ప్రభుత్వ యంత్రాగమై నడుపుతున్నా

మనిషినే..విశ్వంలో ఓ అణువునే!
ప్రకృతి దయతో మనుగడ సాగించేవాడినే!
కరోనా కల్లోలం సమసిపోయినాకైనా
ఎరుకతో మసలేనా?
ప్రకృతి తల్లిని సంరక్షించేనా??

                                           -గోదారి రామయ్య

****************************************************

కవితలుPermalink

2 Responses to మనిషినే (కవిత)- గోదారి రామయ్య