*దేశాన్ని సుభిక్షంగా ఉంచుదాం (కవిత)- పెరుమాళ్ళ రవి కుమార్

ఇపుడొక ఒక చిన్న కణం
ప్రపంచాన్నే గడ గడ లాడిస్తోంది
మానవున్నే సవాలు చేస్తోంది
తనతో పోటీకి రండని
ఇపుడు మా బామ్మే
మా ఇంటికి డాక్టర్
ఆమె వంటింటి చిట్కాలే
మా ప్రాణాలకు రక్ష
నగరాలన్నీ అరణ్యాలను
తలపిస్తున్నాయి
రహదారులన్నీ జంతుసభలకు వేదిలౌతున్నాయి
గృహ నిర్బంధంతో
క్వారంటైనే మన పాలిటి వాలంటైన్స్
కటిక పేదలు కూడూ గుడ్డా లేక
నిరాశ్రయులైన వారెందరో
అన్నార్తుల ఆకలిని తీర్చే
కరుణామూర్తులు ఎందరో
సంఘటితంగా శానిటైజర్ తో
కరచాలనం చేస్తూ
మాస్కులతో ముప్పు తగ్గిస్తూ
దేశసేవ చేసే సైనికులమవుదాం!
నేడు మన రక్షే దేశరక్ష
ఓ……. కరోనా!
నీ కర్కశ మృత్యు పంజరంలో
బంధీకాని చిలుకలు
నా దేశప్రజలు
నీ పుణ్యమా అని
ఆలుమగలు ప్రేమ పక్షుల్లా మెలుగుతున్నారు ప్రేమామృతధారలు కురిపిస్తున్నారు
అన్నదమ్ములు ఆప్యాయతలను అనురాగంతో పంచుతున్నారు
నానాటికీ దూరమవుతున్న బంధాలు
తుమ్మ జిగురులా అతుక్కొని బలోపేతమవుతున్నాయి
నేడు నాదేశంలో
దొంగతనాలు లేవు
మానభంగాలు అసలే లేవు
అమానవీయత లేదు
మానవత్వం తప్ప
మన క్షేమాన్నే కాక
దేశ క్షేమాన్ని కాంక్షించే తరుణం ఇది
దేశ సేవకై అంకితమైన
డాక్టర్లకు పారిశుద్ధ్య కార్మికులకు
పోలీసులకు పాదాభివందనం చేద్దాం
కరోనాతో దేశం శవాలదిబ్బగా మారకముందే
కాళ్ళకు బంధాలు వేస్కో
భవిష్యత్ కోసం
ఇంట్లోనే ఉందాం!
మనమనందరం క్షేమంగా ఉందాం!!
దేశాన్ని సుభిక్షంగా ఉంచుదాం!!!

                              -పెరుమాళ్ళ రవి కుమార్

———————–———————————————–

కవితలుPermalink

One Response to *దేశాన్ని సుభిక్షంగా ఉంచుదాం (కవిత)- పెరుమాళ్ళ రవి కుమార్