కనిపించదు ఇది
వినిపించదు ఇది
మాట్లాడదు ఇది
ఎక్కడ పుటిందో తెలీదు ఇది?
ఎప్పుడు పోతుందో తెలీదు ఇది?
ఎలా పోతుందో తెలీదు ఇది?
పేదవాడి కడుపు మీద కొట్టింది
కూలీల కాలు నరికేసింది
దూరాన్నిపెంచింది, బంధాలు ను తెంచింది
ప్రపంచం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది,
యుద్ధం చేద్దాం రా అంటోంది
ఎంత కాలం ఇంకాఎంత కాలం నీ ఆటలు?
చెప్పు దానికి, మా జోలికి వస్తే
మాకు కాపు కాయడానికి పోలీసులు,
వైద్యం చెయ్యడానికి వైద్యులు ఉన్నారని
మా మరణం మరల జననం
నీ మరణం శాశ్వతమని కరోనాకి భయం పుట్టేలా చెప్పు
భయం లేదు మిత్రమా టీకా తో
ఈ మహమ్మారి మరణం తథ్యం.
-రమాకాంత్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Great idea. Facts put in poetic form
శ్రీ శ్రీ గారు గుర్తు వోచారు మిత్రమా ..!
I don’t understand Telugu, but I am sure his words are beautiful. Rama’s poetry is quite powerful and I was lucky to hear him myself with the help of translation.
Hi Tina, happy to see my words… The words tells
about the present situation of virus…
I am sure I will translate and send it you…