మేము సైతం!!!! (కవిత )- ఆదినారాయణ

అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా కరోనా
ప్రపంచ మంతా వ్యాపించి కబళించి
ఖండాలను సైతం చుట్టపెట్టి
మానవాళి మనుగడను అంధకారం చేసే
ప్రపంచమంతా ఉక్కిరబిక్కిరైన వేళ
ఎక్కడ పుట్టావో ఎలా పుట్టావే కరుణ లేని కరోనా
ప్రపంచమంతా మృత్యు ఘంటికలు మోగిస్తుంటే
దేశదేశాలు కరోనా కోరల్లో అల్లాడి పోతుంటే
పట్టణాలు పల్లెటూళ్ళు వదలక ప్రబలుతోంది మహమ్మారి

కరోనా కబంధ హస్తాల్లో చిక్కకు నేస్తం
క్వారంటెన్ ఒక్కటే కట్టడి చేసే మార్గం
ఐశోలేషన్ ఒక్కటే ఆఖరి అస్త్రం
కాదంటే కాటికి పంపే వరకు వదలదు కసాయి కరోనా
జాగరూకత లేకుంటే కరోనా కాటుకు బలి కావాల్సిందే
గడప దాట కుంటే గృహమే స్వర్గ సీమ
స్వీయ నియంత్రణ శ్రీరామ రక్ష
అవసరాల పేరిట అడుగు బయట పెట్టావో
కంటికి కనిపించని కరోనా కోరలు సాచి విషం చిమ్మే ను
విరుచుకుపడే వినాశనానికి సూక్ష్మాణ్వస్త్రాని వవుతావు
దూడ ను ముళ్ళు తో గుచ్చినట్లు
మళ్లీ మళ్లీ గుచ్చి చెప్పాలా
మనుషులు గుట్టలు గుట్టలుగా రాలుతుంటే
బాధ్యత మరచి బయట తిరిగి బరిగెలకు పోతావా
ప్రాణాలు లెక్కపెట్టక ఆ నలుగురు పోరాడుతుంటే
మేము సైతం అంటూ చేయూత నిద్దాము
కంటికి కనబడని యుద్ధం లో
పోరాడాల్సి నది సరిహద్దుల్లో సైనికులు కాదు
హద్దుల్లో వుండే మనుషులే నిజమైన సైనికులు
హాయి గా ఇంట్లో వుంటూ
సరదాగా కుటుంబం తో గడుపుతూ
దేశం కోసం పోరాడే గొప్ప అవకాశం

కరోనా పై యుద్ధం కావాలి సిద్ధం
అనుకోని విపత్తు ని ఐక్యత తో ఎదుర్కొందాం.

– ఆదినారాయణ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.