మీ గళం(కవిత )-శ్రీను జి

కరోనా కాటేసింది ,
కాలం మొఖం చాటేసింది
ఇంటికంటే గుడి పదిలం
ఇప్పుడు పాత సామెతే
అవుతుంది
అన్నిటికంటే ఇప్పుడు ఇళ్లే పదిలం
ఉరుకులు పరుగుల జీవితానికి
ఎవరో ఎర్రజెండా చూపినట్టు వుంది
దేవుడు అవతారమెత్తి విలయం
వచ్చిన ప్రతీసారి ఆపేవాడంట
బహుశా ఈ వైరస్ కూడా ఒక అవతారమేమో
మనిషి ప్రకృతిపై చేసిన బీభత్సాన్ని
కనిపించి కనిపించకుండా
వినిపించి వినిపించకుండా
చూపించి చూపించకుండా
దేవుడి క్రియేటివిటీని వాడిన తార్కాణమేమో
వాక్సిన్ కనిపెట్టగానే,
గట్టిగా గుచ్చుకొని
డాక్టర్ని మెచ్చుకొని
మళ్ళీ పొల్యూషన్ జండా పుచ్చుకొని తిరక్కుండా
మానవాళి మళ్లీ ఆలోచించుకోవాలేమో
కులం కంపు అని
మతం మత్తు అని
ప్రాంతం పరదా అని
స్నేహం శానిటైజర్ అని,
మానవత్వం మాస్క్ అని,
వాత్సల్యం వెంటిలేటర్ అని
ప్రేమ వాక్సిన్ అని
ఇక ఈ ‘కోవిద్’అం నుండి,
మనిషి ఇంకోవిధం నేర్చుకోవలసిందే
కాదంటే మీ గళం
ఇక మనం మిగలం

-శ్రీను జి
ఆస్ట్రేలియా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.