తలుచుకుంటే కానిదే ముందు- నవీన్ హోతా

మొన్న అణుయుద్దాలు చేసి…
విశ్వాన్ని భయం గుప్పిట్లో కుక్కిపెట్టావు…

నిన్న చంద్రయానం చేసి…
ప్రపంచాన్ని చంద్రమండలపు కలల్లో ఊరేగించావు…

నేడు అణువంత లేని క్రిమి చేతుల్లో
కంటికి కనిపించని జీవి చేసే యుద్ధంలో
నిరాయుధుడివై
నిస్సహాయుడివై
నిరాశా హృదయాన్ని మోసుకుంటూ
బోసిపోయిన వీధుల్లో నిన్నోసారి ఊహించుకుంటూ
అందరూ ఉండి అనాధ శవాలవుతున్న
మహమ్మారి పీడితుల ముఖాల్లో నిన్ను పరికించుకుంటూ
వెన్నులో వణుకును ధైర్యపు కత్తితో నరుకుతూ…
చుక్క రక్తం లేని ముఖానికి నవ్వుల లేపనాన్ని పులుముకుంటూ
బింకాన్ని ,కుటుంబంపై బాధ్యతని
కావడి కుండలుగా మార్చుకున్న నీ సాహసంతో
తరమగలవా ఆ మూడక్షరాల మాయాజాలాన్ని…
పరిగెత్తించగలవా ఆ మాయలాడి కరోనాని…
తుదముట్టించగలవా ఆ మహమ్మారి మారణహోమాన్ని…!
కానిదేముంది తలచుకుంటే …
నిర్బంధంగా నువ్వు ఇంట్లో ఉంటే…
నలుగురు సైనికుల సహాయానికి

నీవంతు సాయం చేస్తూ

ఆయుధాలు లేని యుద్ధం చేయాలి….
అసలు చేతులే వాడని

యుద్ధతంత్రాన్ని అమలుపరచాలి…!!

-నవీన్ హోతా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

One Response to తలుచుకుంటే కానిదే ముందు- నవీన్ హోతా

  1. ఓ కోయిల says:

    చాలా బాగుంది నవీన్ గారూ అభినందనలు 👍💐💐💐