ఇక చాలు వెళ్లిపో -శ్రీ అక్షర,

కరోనా !
ఓ మాయదారి కరోనా !
రాకాసిలా భయపెడుతూ
దేశ, దేశాలు మింగుతూ
మా భారతదేశంలో అడుగెట్టావు.

విద్యార్ధుల చదువులను పాడుచేశావు.
ఎన్నో మా విజయాలకు అడ్డుపడ్డావు.
కష్టజీవుల పొట్టకొట్టి కష్టాలు పెట్టావు.
ఎంతోమందిని బలి తీసుకున్నావు.
సంతోషాలు లాక్కుని కన్నీళ్ళు ఇచ్చావు.

డాక్టర్లు,పోలీసులు,పారిశుద్ధ్య కార్మికులు,
వాలంటీర్లు ప్రజలకు అండగా నిలబడ్డారు.
ఎన్నో కష్టాలున్నా లాక్ డౌన్ పెట్టుకున్నాం.
మా పరిశుభ్రతతో నిన్ను ఎదిరిస్తున్నాము.
సామాజికదూరంతో నీకు అడ్డుకట్ట వేస్తున్నాం.

కరోనా ! ఓ కరోనా !
ఇక చాలు వెళ్లిపో !!

రచన : శ్రీ అక్షర, 5వ తరగతి
సెయింట్ థెరిస్సా ప్రాధమిక పాఠశాల
ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.