లాక్ డౌన్*(కవిత )– శ్రీ కాట్రగడ్డ

చర్చ్,దర్గా,దేవాలయాలముఖద్వారాలు

తెరుచుకోవడంలేదు,

గ్రంధాలయాల్లో సరస్వతి కరపల్లవాల

వీణారావం విన్పించడంలేదు,

రక్షణాలయాల్లో లాఠీలు రబ్బరునరాలై

టకటకల సంగీతసల్లాపాలుసాగుటలేదు

విద్యాలయాలు వినోదక్రీడారామాలూ

విధులు మరచి క్షణాల్ని మలచడంలేదు

మేఘాలు కదులుతున్నాయోలేదో!

మానవులంతా గృహానిర్బంధాల్లో…!!

ఉషోదయాలునిషాకాంతులనెగుడుతూ

సంధ్యాసౌధనీడల్నిపరుస్తూనేవున్నాయి

పక్షులకీలకిలారావాలు

మయూరి నృత్యాలు కన్పించక

పువ్వుల రంగుల రాజిల్లుపరిమళాలు

విశ్వవనానవ్యాపించడమ్మానినట్లున్నా

జీవశ్వాసావయవాలుచలిస్తూవున్నాయ్

ఏమిటీ దేశ సంస్కృతి స్థాణువై

విశ్వాణువును స్పందింపజేయడంలేదు

జీవం సజీవమైకూడా దూరదూరంగా

నడయాడుతూ శ్వాసను నిశ్వాసిస్తూ

నిన్నలా నేడునూ రేపుకూడా బందీ…

గృహాలబందీ గ్రహాలసంబంధంగానే!

సహజీవతతుల ఛాయాదర్పణలీలలై…

                                                                – శ్రీ కాట్రగడ్డ

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink

Comments are closed.