కరోనా ఓ కరోనా(కవిత )-నవీన్ హోతా

ఇప్పుడిలా ఐకమత్యాన్ని ఊరేగిస్తున్నారు

స్వీయ నిర్బంధపు దారుల్లో

భాధ్యతనెఱిఁగిన మేనాలో

ఇప్పుడిలా కొత్త ఆలోచనల బూజుల్ని పగలగొడుతున్నారు

కుగ్రామమైన ప్రపంచపు మూలాల్లో

పాతతరాల విలువల్లో

శహభాష్

ఓ కరోనా….

బాధలో ముంచినా

బాధ్యతలు గుర్తుచేశావ్

బహుపరాక్

ఓ కరోనా

కష్టాలతో చుట్టుముట్టినా

కాగల కార్యాన్ని ఎరుకపరచావ్

జీ హుజూర్

ఓ కరోనా

ఇబ్బందుల సునామీని పరిచయించినా

ఇన్నాళ్ల నేనేమిటో తెలియపరచావ్

కానీ నువ్వోడిపోతావ్

నువ్వు గుర్తు చేసిన నా వేదాల సాక్షిగా నువ్వోడిపోతావ్

నువ్వు జ్ఞప్తికితెచ్చిన నా పురాతన తీరుల చేతుల్లో

నువ్వోడిపోతావ్

నువ్వు లాక్కొచ్చిన నా ఆచారాల నిధి నిక్షేపాల వెలుగులతో

నువ్వోడిపోతావ్

నా తాత ముత్తాతలు నాకందించిన

విలువల అస్త్రాలతో

నువ్వోడిపోతావ్

నా బామ్మలూ గురువులూ నాకు నేర్పిన

సృష్టిరహస్యాలతో

నువ్వోడిపోతావ్

తప్పక ఓడిపోతావ్…!!

-నవీన్ హోతా

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలుPermalink
0 0 vote
Article Rating
2 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
కె.రాధిక నరేన్
కె.రాధిక నరేన్
9 months ago

బాగుంది కవిత్వం నవీన్ గారు

Vinay kumar
Vinay kumar
9 months ago

చాలా బాగా రాశావ్ నవీన్. కానీ కొత్త ఆలోచన బూజుల్లో అంటే అర్థము కాలేదు