*కరోనా..చలోనా…*(కవిత )–డా.వూటుకూరి వరప్రసాద్

ప్రపంచ వేదికపై కరోనా

కరాళ నృత్య మాడుతోంది

ప్రజల ప్రాణాలకు వలవేసి

మృత్యుగీతం పాడుతోంది

అగ్రగామి దేశాలు కరోనా పంజాకు చిక్కి విలవిల లాడుతూ ఉన్నాయి

పోయిన వారికి భూమ్మీద చోటులేక

శవాలు పెట్టెల్లోనే ఉన్నాయి

ఈ స్థితిని గమనించిన పాలకులు

మనకీలాంటి దుస్థితి రాకూడదని ఎంచారు

నివారణే శరణ్యమని మన  నేతలు

ఇంటివద్ద ఉండమని హితవుని పంచారు

రంగంలోకి దించారు వైద్య బృందాలను

శాంతి కపోతాల్లా రేపవలు సేవకు

ఖాకీలను ఉంచారు రహదారుల పైన

నియంత్రణా మంత్రణపు తోవకు

నర్సులు సచివాలయ సిబ్బంది

వాలంటీర్లు వీరు నిరంతర సేవకులు

క్షణం క్షణం పరిస్థితులను తెలుపుతూ

దిక్సుచిలా నిలిచిన  నావికులు

స్వీయ నియంత్రణే మన మంత్రంగా

పాటించకపోతే మరో ఇట లీలా మారుతుంది

ప్రాణం విలువ తెలుసుకోండి ప్రజలారా!

ప్రభుత్వ చర్యల్ని స్వాగతించండి మనసారా!

గంజితాగాయినా గడపలో ఉండండి

గుంపులుగా చేరొద్దు ముంపుకు గురికావొద్దు

అప్పుడు మనందరికీ రాదు కరోనా

అప్పుడు మనం చెప్పొచ్చు కరోనా…ఛలోనా…

      -డా.వూటుకూరి వరప్రసాద్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలుPermalink
0 0 vote
Article Rating
1 Comment
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
corona paata
corona paata
9 months ago

“నేలతో నీడ అన్నది” పాటకి COVID-19 theme తో మేము చేసిన parody ప్రయత్నాన్ని చూడండి: https://youtu.be/KRgEz5k3H7I