పల్లెలు,పట్నాలు అనే భేదం లేకుండా
పెద్ద,పేద అనే కనికరం చూపకుండా
దొరికిన వారిని కబలిస్తూ
వారి ఊపిరితిత్తుల రసాన్ని పీల్చేస్తూ
ప్రపంచంలో అందరి నిద్రను దోచేస్తూ
అల్లకల్లోలం,అతలాకుతలం చేసేస్తూ
కనికరం లేని మహమ్మారి కరాళ
నృత్యం చేస్తూ
ఖాళీగా ఉన్న రోడ్ల పైన కాపు కాస్తూ
కనపడిన వారి రక్తాన్ని తాగేస్తూ
నరకాన్ని,నరకయాతనను చూపిస్తూ
మమకారం లేకుండా మరణశయ్య ఆహ్వానిస్తుంది
ఆహాకారాలు చేసి అందరిని ఏడిపిస్తుంది
జాలి లేని రాకాసి వలే కరోనా విజృభిస్తుంది
తల్లి,పిల్లా వ్యత్యాసం లేకుండా దూరం చేస్తుంది
భాదనే మిగుల్చుతుంది, భారంగా జీవితం గడుస్తుంది
ఒంటరి జీవితం అలవాటు చేస్తుంది
ఒకడిగానే వచ్చావు,ఒక్కడివే కాకుండా
వందమందిని నీతో తీసుకుపో అని అంటిస్తుంది
ఈ నేపథ్యంలో మానవాళి మనుగడ సాగాలి అంటే
పురాతన సంప్రదాయాలు ఆచరించవలసిందే
జాతి,జాగృతిని కాపాడుకోవాల్సిందే
-నాగరాజు.జి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
Super sir