వ్యక్తిగత బాధ్యత…(కవిత ) -వినయ్ కుమార్ కొట్టే

కనిపించని శతృవేదో నిన్ను ఖతం చేస్తుంటే….

కరోనా రక్కసి నీ బ్రతుకును కబళిస్తుంటే…

నువ్ మొక్కే దేవుళ్లంతా గుడి తలుపులు మూసుకుంటే…

దైవం మనుష్య రూపేణా అన్నట్లు

రాత్రింబవళ్లు వాళ్లంతా కష్టపడుతుంటే…

చెపితే కానీ మాస్కు పెట్టుకోలేవా? 

కొడితే కానీ ఇంట్లో కూర్చోలేవా?

రోడ్డెక్కకపోతే నీకు రోజు గడవదా?

తిరుగుళ్లు లేకపోతే నీకు తెల్లారదా?

ఎందుకంత ఆరాటం..

ముందు చెయ్యి పోరాటం..

ఆయుధాలేవి నువ్ వాడక్కరలేదు 

అస్త్రాలు, శస్త్రాలు అసలక్కరలేదు..

నిర్బంధంలో  ఉంటే ఏ బంధాన్ని నువ్ వీడి పోవు ..

ఇంట్లో కూర్చో చాలు అదే నువ్ దేశానికి చేసే మేలు…

-వినయ్ కుమార్ కొట్టే

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`

కవితలుPermalink

Comments are closed.