మనిషికీ మనిషికీ మధ్య మరో తెర (కవిత )- ఈడిగ నగేష్ ,

విశ్వ వీధిలో ఏ నోట విన్నా 

ఆ మాటే

అందరి తలుపుల్లో అదే గుబులు

ప్రపంచo కళ్ళపై కునుకు లేకుండా జన జీవనాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి

కన్న బిడ్డల్ని తాకడానికే బయపడే వినూత్న సంస్కృతికి నాంది పలుకుతోంది.

మనిషిని మనిషే ముట్టుకోడానికి భయపడే రోజు వస్తుందని ఎవ్వరు ఊహించని రోజు

సందె వేళల జిగి బిగి కాంతులతో

సందడి చేసే నగరాలు నిర్మానుష్యంగా 

స్మశానంను తలపింప చేస్తున్నాయి

నిత్యo కిక్కిరిసిపోయిన రహదారులు

నడవడానికి మనిషే లేక వెల వెల పోతున్నాయి.

భూమిని మింగడానికి రాహు,కేతువులు

 హఠాత్తుగా వచ్చినట్టు 

కరోనా విశ్వం హృదయంపై కరాల నృత్యం చేసి

మనుషులను శవ పేటికలో బంధిచి వేస్తోంది.

కరోనా కర్కోటక రూపం దాల్చి

విశ్వంపై విషపు వాయువులు

వెదజాల్లుతూ అందరిని అమాంతంగా  

అంత మొందించాలని అర్రులు చాస్తోంది.

రండి ఒక్కరోజు బాహ్య ప్రపంచానికి 

గుడ్ బాయ్ చెప్పి బందీలుగా గడుపుదాం 

మన వంతు ప్రయత్నంగా 

కరోనా భూతాన్ని తరిమి కొట్టడానికి ప్రయత్నిద్దాం.

– ఈడిగ నగేష్

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

కవితలుPermalink
0 0 vote
Article Rating
3 Comments
Newest
Oldest Most Voted
Inline Feedbacks
View all comments
Ramakrishna reddy
Ramakrishna reddy
9 months ago

నేటి ఆధునిక యుగంలో జీవించుట ఎంత దుర్బరమో చక్కగా వివరించారు

surendra
surendra
9 months ago

good

రాఘవేంద్ర
రాఘవేంద్ర
9 months ago

గుడ్